ఒక స్టార్ హీరో పై తాను జెలసీ పెంచుకుంటున్నాను అని ఒక హీరోయిన్ చెప్పడానికి చాల ధైర్యం ఉండాలి. అయితే శ్రుతిహాసన్ మాత్రం తాను ఇప్పటి వరకు నటించిన హీరోల మనస్తత్వాల పై షాకింగ్ కామెంట్స్  చేయడమే కాకుండా తాను జూనియర్ ఎన్టీఆర్ ను చూసి జెలసీ ఫీల్ అవుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

ఆసక్తికరమైన శ్రుతి కామెంట్స్ వివరాలలోకి వెళితే జూనియర్ డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా ఇట్టే పట్టేస్తాడు అని అంటూ సింగిల్ టేక్ లో జూనియర్ తన సీన్ ను పూర్తి చేసే అతడి సమర్ధతను చూసి తనకు జెలసీగా ఉండేదని శ్రుతి సెటైర్లు విసిరింది. దీనితో జూనియర్ తో నటించేడప్పుడు కెమేరా ముందు నుంచునే ప్రతీసారి తప్పనిసరిగా రిహార్సల్ చేయవలసి వచ్చేదని అందుకే తనకు ఎన్టీఆర్ అంటే విపరీతమైన జెలసీ అంటూ కామెంట్స్ విసిరింది. 

ఇక ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సెలెబ్రెటీగా ఉంటూ కూడ సాధారణమైన జీవితం గడిపే పవన్ లాంటి హీరోను తను ఎక్కడా చూడలేదు అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించింది. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ మనిషి ఎంత అందగాడో అతడి మనసు కూడ అంతే అందం అంటూ మహేష్ ను ఆకాశానికి ఎత్తేసింది శ్రుతి.

ఇక అల్లుఅర్జున్ గురించి మాట్లాడుతూ అతడి ఎనర్జీని చూసి తాను షాక్ అయ్యేదానిని అంటూ ‘రేసుగుర్రం’ సినిమాలో బన్నీతో కలిసి డాన్స్ లు చేయడానికి తాను పడ్డ కష్టం ఆదేముడుకే తెలుసు అంటూ బన్నీ ప్రతిభను కూడ పొగిడింది శ్రుతి. ఇక చివరిగా రవితేజా – రామ్ చరణ్ ల గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎప్పుడూ నవ్వుతూ ఎలా బతకాలో తాను రవితేజా నుంచి చాల నేర్చుకున్నాను అని అంటూ ఎంత మంది హీరోలు ఉన్నా తనకు వ్యక్తి గతంగా మంచి స్నేహితుడు రామ్ చరణ్ మాత్రమే అంటూ చెర్రీతో తన సాన్నిహిత్యాన్ని బయట పెట్టింది ఈ చారుశీల..
 


మరింత సమాచారం తెలుసుకోండి: