హీరో కలెక్షన్ల స్టామినా గురించి పట్టించుకోకుండా సినిమా నిర్మాణ ఖర్చును రోజురోజుకీ పెంచేస్తూ పోవడంతో టాప్ హీరోల సినిమాలు కొనుక్కున్న బయ్యర్లలో లాభ పడినవారు మచ్చుకు కూడ కనిపించ కుండా పోవడంతో భవిష్యత్ లో టాప్ హీరోల సినిమాలకు అసలు బయ్యర్లు దొరుకుతారా అనే పరిస్థితుల్లోకి టాలీవుడ్ దిగ జారి పోతోంది. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా విడుదల అయిన ‘సరైనోడు’ సినిమాకు అల్లు అర్జున్ రెమ్యూనిరేషన్ కాకుండా 52 కోట్లు ఖర్చు  చేసారు అన్న వార్తలు టాలీవుడ్ కు  షాక్  యిస్తున్నాయి. 

దీనితో అంత అనుభవం  ఉన్న అల్లు అరవింద్ అంత తప్పు ఈ ‘సరైనోడు’ పై చేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరో, ఇద్దరు హీరోయిన్లు,  విలన్ తో పాటు  మిగిలన వారి కాల్ షీట్ లు అన్నీ రోజుల వారీ లెక్క వేసుకున్న ఇంత ఖర్చు ఎక్కడ అయి పోయింది అని లెక్కలు వేస్తున్నారు. అయితే బొలీలియాలో చేసిన పాటకు కోటిన్నర, పబ్ పాటకు రెండున్నర కోట్లు ఖర్చుచేరు అనే వార్తలు  బయటకు వస్తూ ఉండటంతో అల్లుఅరవింద్ అనుభవం ‘సరైనోడు’ విషయంలో పని చేయలేదా అనే సెటైర్లు కూడ పడుతున్నాయి. 

అయితే ఈ వార్తలు అన్ని ‘సరైనోడు’ విషయంలో రిలీజ్ కు ముందు బయ్యర్లలో క్రేజ్ పెంచడానికి ఈ బడ్జెట్ న్యూస్ ను చాలా వ్యూహాత్మకంగా అరవింద్ ప్రయోగించాడని కొందరి వాదన. కొందరు టాలీవుడ్ విశ్లేషకులు చెపుతున్న లెక్కల ప్రకారం నాలుగు ఏరియాల్లో సెట్స్, పాటల సెట్టింగ్స్, ఓ సాంగ్ అవుట్‌డోర్ తప్పితే ఇందులో పెద్దగా ఖర్చు చేసిందేమీలేదు అని అంటున్నారు. 

ఇక బొలీవియాలో ఓ సాంగ్ షూట్ చేసినప్పటికీ  దీనివల్ల ‘సరైనోడు’ కి కలిసి వచ్చేది  లేదు అని అంటూ ఈ సినిమాను 30 నుంచి 35 కోట్లలోపు అరవింద్ పూర్తి చేసారని బయ్యర్లకు మంచి రేటుకు అమ్మే విధంగా  ఈ భారీ బడ్జెట్ న్యూస్ ను ప్రచారంలోకి తెచ్చారు అనే కామెంట్స్ కుడా ఉన్నాయి.  అదీ కాకుండా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను తెలుగు, మలయాళం, హిందీలకి  సన్ టీవీకి 16 కోట్లకు అమ్మే వేసిన నేపధ్యoలో ఈ సినిమా టాక్ ఎలా ఉన్న ప్రొడ్యూసర్ కు 10 నుంచి 15 కోట్ల వరకు ప్రాఫిట్‌ వచ్చే ఛాన్స్ వుందని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఈ 54 కోట్ల ఖర్చుల లీకులు కేవలం ఈ సినిమా ఇమేజ్ పెంచడానికే అనే కామెంట్స్ ఉన్నాయి. ఎంత ప్రచారం ఈ సినిమా పై జరిగినా బయ్యర్లకు కలిసి వచ్చేదిలేదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: