మోహన్ బాబు తీసుకునే ఏ నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం మంచు కుటుంబం చేయదు. దీనికి కారణం మంచు కుటుంబ సభ్యుల పై మోహన్ బాబుకు అంత పట్టు ఉంది. అయితే ఈసారి మోహన్ బాబు తీసుకున్న ఒక నిర్ణయాన్ని అతడి కుమారుడు మంచు విష్ణు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక మీడియా ఇంటర్వ్యూలో సూచన ప్రాయంగా తెలియచేసాడు. 

ఒకప్పుడు రాజకీయాల్లో మోహన్ బాబు యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆ  తర్వాత మారిన పరిస్థుతులలో మోహన్ బాబు రాజకీయాలకు దూరమైపోయాడు. అయితే త్వరలో రాజకీయాల్లోకి వెళ్లేందుకు మోహన్ బాబు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా స్వయంగా మోహన్ బాబు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ నిర్ణయం మంచు విష్ణుకు ఇష్టం లేదట. 

అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కూడ తన తండ్రి తీసుకున్న నిర్ణయం నచ్చడం లేదని సంకేతాలు ఇస్తూ కామెంట్స్ చేసాడు. సినిమా రంగంలో ఎంత కాలమైనా గౌరవంగా జీవించవచ్చు అయితే రాజకీయాల్లోకి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని మంచు విష్ణు భావనగా కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు సినీ స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలిసాక కూడ తన తండ్రి రాజకీయాలలోకి వెళ్ళడం తనకు ఇష్టం లేదని తన మనసులో మాటను బయట పెట్టాడు. 

ఇదే సందర్భంలో మంచు విష్ణు మరో విషయాన్ని లీక్ చేసాడు. తాను నటించే ప్రతి సినిమా స్క్రిప్ట్ ను తన తండ్రికి ముందు చూపెడతానని ఆ స్క్రిప్ట్  చూసిన తరువాత తన తండ్రి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించి తనకు చెపుతారు అంటూ తన తండ్రి పై ప్రశంసల వర్షం కురిపించాడు విష్ణు.  ఈమధ్య కాలంలో తాను నటించిన సినిమాలలో ‘రౌడీ’, ‘అనుక్షణం’ సినిమాలు తనకు బాగా నచ్చినా ఆ సినిమాల రిజల్ట్ ను ముందుగానే మోహన్ బాబు ఊహించిన విషయాన్ని తెలియచేసాడు ఈ మంచు వారి అబ్బాయి. అయితే విష్ణు అభిప్రాయాలను మోహన్ బాబు ఎంత వరకు పాటిస్తాడో రానున్న రోజులలో తేలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: