ఈ మధ్య కాలంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, తన మూవీలకి సంబంధించిన విషయంలో వంద శాతం క్వాలిటీని ఎక్స్ పెక్ట్  చేస్తున్నాడు. మూవీ హిట్ అయినా, ఫట్ అయినా…తెరకెక్కిన మూవీ మాత్రం వంద శాతం క్వాలిటీతో తెరకెక్కాల్సిందే అనేది బన్నీ ఫార్ములా. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలు అన్నీ ఫుల్ క్వాలీటీగా వస్తున్నవే. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన సరైనోడు మూవీకి సైతం నెంబర్ వన్ టెక్నిషన్స్ పని చేశారు.


అందుకే సరైనోడు చిత్రం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ బయటకు వచ్చింది. అలాగే ఈ చిత్రానికి బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ రావటంతో, అల్లుఅర్జున్ సైతం ఫుల్ హ్యీపీగా ఉన్నాడు. సరైనోడు మూవీ తనకి సూపర్ కిక్ ని ఇచ్చిందని చెప్పుకువస్తున్నాడు. మూవీపై ఎక్కడా నెగిటివ్ టాక్స్ రాకుండా ఎక్కడిక్కడ సక్సెస్ మీట్, కోక్ టైల్ పార్టీల వ్యవహారలు నడుపుతున్నారు.


దీంతో సరైనోడు మూవీపై ఎక్కడానెగిటివ్ టాక్స్ రావటం లేదు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీనుపై బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఈ సినిమాతో తాను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యానని, బోయపాటితో తనకు ఇది చాలాని చెప్పుకొచ్చాడు. దీని ఉద్ధేశం ఇక ఇప్పట్లో బోయపాటితో అల్లుఅర్జున్ మూవీ లేనట్టే అని స్పష్టం అయింది.


ఇప్పటి వరకూ సరైనోడు కి సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీంతో ఇది లేనట్టే అని బన్నీ కామెంట్ తో తెరపడింది. సరైనోడుతో వచ్చిన యాక్షన్ ఇమేజ్ నుండి కొంత బయట పడాలంటే కొన్ని లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలను చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: