పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమాను స్టార్ట్ చేయడం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఖుషి దర్శకుడు ఎస్.జె.సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే సినిమాను ఎలాంటి హంగామా లేకుండా స్టార్ట్ చేయడం విశేషం. ఖుషి సీక్వల్ గా రాబోతున్న ఈ సినిమా 'హుషారుగా' అనే టైటిల్ పెట్టబోతున్నట్టు టాక్. 


ఖుషి సినిమా రిలీజ్ అయిన ఈరోజునే ఈ సినిమా స్టార్ట్ అవడం హిట్ సినిమా సెంటిమెంట్ అని భావించాలి. ఇక పవన్ కళ్యాణ్ తో ఎస్.జె సూర్య ఖుషి, పులి సినిమాలు తీశాడు. ఖుషి ఓ రేంజ్ హిట్ అవగా పులి ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మరి ముచ్చటగా మూడోసారి జతకడుతున్న వీరిద్దరు ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తారో చూడాలి. 


పవర్ స్టార్ మూవీ ఓపెనింగ్ :


సర్దార్ గబ్బర్ సింగ్ కు అన్ని తానై నడిపించిన పవన్ ఈ సినిమాను ఎస్.జె సూర్య చేతిలో పెట్టాడు. ఇక చేసే రెండు మూడు సినిమాలన్నా స్పీడ్ గా చేసి అభిమానులను అలరించాలని చూస్తున్నాడు. సినిమా రిలీజ్ 2017 సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తుండటం విశేషం. 


మరి పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య చాలా ఏళ్ల తర్వాత పనిచేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధిస్తుందో.. సర్దార్ ద్వారా నష్టపోయిన పంపిణీదారులకు ఈ సినిమా ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిసైడ్ చేయకపోవడమే..!


మరింత సమాచారం తెలుసుకోండి: