స్టార్ హీరోయిన్ సమంత ఈరోజు తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. అయితే ఈ సందర్భంగా తనకు వచ్చిన ఊహించని గిఫ్ట్ చూసి షాక్ అయింది సమంత. ఒక పసి పిల్ల వాడిని గిఫ్ట్ ప్యాక్ చేసి ఆమెకు గిఫ్ట్ గా పంపించారు. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్లో వెల్లడించింది. ఆ పసివాడు ఎవరో కాదు, సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ కుమారుడు ఆన్ష్. 

ఆన్ష్ ను ప్యాక్ చేసినట్లు అతన్ని బాక్స్ నుండి బయటకు తీస్తున్నట్లు సరదాగా ఫోటో తీసి ఇలా ట్విట్టర్లో పోస్టు చేసి వెబ్ మీడియాలో హడావిడి చేసారు. సమంతకు ఆన్ష్ అంటే విపరీతమైన ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఆ పిల్లవాడిని దేవుడు ఇచ్చిన కొడుకుగా ఆమె భావిస్తూ ఉంటుంది. 

ఈ మధ్య సమంత ఆన్ష్ తో చాలా క్లోజ్ గా కాలం గడుపుతోంది. ఆ పిల్లవాడితో సరదాగా ఆడుకుంటూ ఉంటే తనకు టైమ్ తెలియడం లేదు అంటూ ఆమధ్య తన కామెంట్స్ ను కూడ తన ట్విటర్ లో పెట్టింది. ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్న సమంతకు రానున్న నెల చాల కీలకంగా మారిoది. 

ఆమె సూర్యాతో నటించిన ‘24’ మహేష్ తో నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఒకేసారి ఒకేనెలలో రెండు వారాల గ్యాప్ తో విడుదల అవుతూ ఉండటంతో ఆ సినిమాల విజయం పై గంపెడు ఆసలు పెట్టుకుంది సమంత. ఆమె కెరియర్ కు సంబంధించి ఈ రెండు సినిమాల విజయం ఆమెకు కీలకం. మరి ఈపుట్టినరోజు ఆమె కెరియర్ కు ఎటువంటి టర్నింగ్ ఇస్తుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: