సినిమా క్వాలిటీ బడ్జెట్ ను బట్టే ఉంటుంది. అయితే కొన్నిసార్లు తక్కువ బడ్జెట్ అయినా సరే ఎక్కువ క్వాలిటీతో కనబడతాయి. అయితే క్వాలిటీ అంటూ సినిమా షూటింగ్ టైంను పెంచేస్తూ ప్రొడక్షన్ ఖర్చు పెంచేస్తుంటారు చాలామంది దర్శక నిర్మాతలు. ఇందులో హీరోల సహకారం బాగా ఉండాలి. అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ 80 కోట్ల బడ్జెట్ సినిమా కేవలం 38 రోజుల్లో కంప్లీట్ చేశారట.  


బాలీవుడ్ లో అత్యధిక ట్యాక్స్ పేయర్ అక్కి అక్షయ్ కుమార్. సినిమా బడ్జెట్ ఎంతైనా సరే సినిమాను అనుకున్న తక్కువ టైంలో ఫినిష్ చేయాల్సిందే. అంతేకాదు సినిమా కోసం వీక్ లో 5 డేస్ ఫుల్ టైం కేటాయిస్తాడు అక్షయ్ ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న హౌజ్ ఫుల్ -3 కేవలం 38 రోజుల్లో కంప్లీట్ చేశారట.


సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు పడితే అనవసరంగా ఖర్చు ఎక్కువవుతుందని.. అందుకే తన సినిమాల్లో ప్రొడక్షన్ కరెక్ట్ గా ఉండాలని చూస్తానని అంటున్నాడు అక్షయ్ కుమార్. మరి భారీ బడ్జెట్ అయినా సరే తక్కువ టైంలో తీస్తే దానికి తగ్గ ఫలితాలు అందుతాయని అంటున్న అక్షయ్ కుమార్ మాటలకు ఎంతమంది సపోర్ట్ పలుకుతారో  తెలియదు.


మరి నిర్మాత విలువలను కాపాడగలిగే హీరో కచ్చితంగా పరిశ్రమ మంచి కోసమే ఆలోచించగలుగుతాడు. అక్కి చెబుతున్న ఈ ఫార్ములాను అందరు స్టార్ హీరోలు పాటిస్తే ఖర్చు తగ్గుతుంది. దానితో పాటుగా ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతుంది. దీని గురించి ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూద్దాం.



మరింత సమాచారం తెలుసుకోండి: