మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఖ్యాతి గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మోహన్ లాల్ క్రేజ్ టాలీవుడ్ ప్రేక్షకులలో కూడ ఉంది.లేటెస్ట్ గా మోహన్ లాల్ తెలుగు సినిమాలో నటిస్తూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడానికి తెలుగు భాషను చాలా శ్రద్ధగా నేర్చుకున్న విషయం  తెలిసిందే.

ఈ రోజు మోహన్ లాల్ పెళ్ళిరోజు. ఈ రోజుతో మోహన్ లాల్  తన భార్య సుచిత్రను పెళ్ళి చేసుకుని 28 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో తన 28వ వివాహ వార్షి కోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్యతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఒక ఫోటోను తన ట్విట్టర్ లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ రోజు మోహన్ లాల్ తన భార్య సుచిత్రతో వియత్నాంలో తన మ్యారేజ్ డేని  ఆనందంగా జరుపుకుంటున్నట్లు ట్విట్ చేసాడు. 

తను నటించే సినిమాల పాత్రలలో చాలాగంభీరంగా కనిపించే మోహన్ లాల్ లో ఈ రొమాంటిక్ యాంగిల్ చూసి చాలా మంది షాక్ అయ్యారు. ప్రస్తుతం జూనియర్ తో నటిస్తున్న ‘జనతా గ్యారేజ్ సినిమాలో మొహన్ లాల్ జూనియర్ పెదనాన్నగా కనిపించ బోతున్నాడు. ఈసినిమాలో మోహన్ లాల్ జూనియర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కంట తడి పెట్టిస్తాయని టాక్. 

త్వరలో దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీస్తున్న సినిమాలో కూడ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించ బోతున్నాడు. ఏపాత్రను అయినా అవలీలగా నటించే మోహన్ లాల్ తాను తలుచుకుంటే రొమాన్స్ ను కూడ ఎంత బాగా పండించగలడో ఈ ఫోటో ద్వారా రుజువు చేస్తున్నాడు మోహాన్ లాల్. ఈఫోటో నేటిరోజు వెబ్ మీడియాకు టాపిక్ ఆఫ్ ది డేగ మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: