మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా మొదలెట్టబోతున్న ఈ సందర్భంలో సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చిన్నగా రివీల్ అవుతున్నాయి. విజయ్ నటించిన కత్తి సినిమా రీమేక్ చేస్తూ కత్తిలాంటోడులా వస్తున్న చిరు మెగా అభిమానులకు మెగా సినిమా అందించే క్రమంలో టెక్నికల్ టీం కూడా గొప్ప నైపుణ్యంతో ప్రదర్శించేలా సెలెక్ట్ చేస్తున్నారు.


ఇక అదే దారిలో ఈ సినిమాకు సినిమాటోగ్రఫీగా రత్నవేలు చేయడం విశేషం. ఆర్య, జగడం, 1 నేనొక్కడినే, కుమారి 21ఎఫ్ సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసిన రత్నవేలు శంకర్ రోబో సినిమాకు పనిచేయడం విశేషం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమాకు పనిచేస్తున్న రత్నవేలు మెగాస్టార్ సినిమాకు వర్క్ చేయడం జరుగుతుంది. 


వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను కొణిదెల మూవీస్ పతాకంలో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ నెల 29న లాంచనంగా స్టార్ట్ అవుతున్న కత్తిలాంటోడు సినిమా ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యే అవకాశాలు ఉనాయి. కత్తిలాంటోడికి అన్ని కత్తి లాంటి కాంబినేషన్స్ షురూ అవుతున్నాయి ఇక సినిమా ఎలా ఉండబోతుందో మరి. 


ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ కోసం సిట్టింగ్ రెడీ చేశాడు. ఒక్క హీరోయిన్ విషయంలో తప్ప కత్తిలాంటోడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరి రేపు ముహుర్త సమయంలో అయినా హీరోయిన్ ఫైనల్ గా ఎవరన్నది చెబుతారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: