ఎప్పుడైతే బాలయ్య తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి అని ఎనౌన్స్ చేశాడో అప్పటినుండే బాలకృష్ణ వందో సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. ఇక రీసెంట్ గా జరిగిన సినిమా లాంచింగ్ కార్యక్రమంలో కూడా శారకర్ణి విశిష్టత గురించి చెప్పారు. అయితే అభిమానులు బాలయ్య వందో సినిమా మీద బాగా గురితో ఉన్నారు. అందుకే సినిమా లాంచ్ చేసిన కొద్ది రోజులకే ఫ్యాన్ మేడెడ్ టీజర్ రిలీజ్ చేశారు. 


నిజంగా అభిమానం అంటే ఇంత పీక్స్ లో ఉంటుందా అన్న విధంగా ఉంది ఆ టీజర్ చూస్తుంటే.. బాలయ్య కట్ అవుట్ ని కూడా పర్ఫెక్ట్ గా వాడుకుని.. హాలీవుడ్ సినిమాల్లోని థీంతో టీజర్ మాత్రం అదరగొట్టేశారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య తన ఉగ్రరూపాన్ని చూపించనున్నారు. 


ఇప్పటికే అంచనాలు పెంచేలా ఈ పోస్టర్ ఉంటే ఇక సినిమా కోసం ఓ కత్తుల ఫ్యాక్టరీనే చూస్తున్నాడు క్రిష్. తన దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఓ మంచి అభిరుచితో తీస్తున్న డైరక్టర్ క్రిష్ సినిమాను అభిమానులు మెచ్చేలా తీర్చిదిద్దడంలో తలమునకలవుతున్నాడు. ఇక ఇంతటి ప్రెస్టిజియస్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. 


సినిమా సంగీతం కోసం అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాట్లు చేస్తున్నాడు దేవి. ఫస్ట్ ఫ్రేం ప్రొడక్షన్ లో సాయి బాబు, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌతమిపుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్నాడు. మరి భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా చరిత్రలో ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: