మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ఒక ఆసక్తికర లీక్ మహేష్ అభిమానులలో కలవరం పుట్టిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తలప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు పై ఒక్క ఫైట్ సీన్ కూడ ఉండదట. సాధారణంగా మహేష్ బాబు ప్రతి సినిమాలోనూ యాక్షన్ సీన్లు ఉంటాయి. మహేష్ గత చిత్రం ‘శ్రీమంతుడు’ లో మహేష్ బాబు యాక్షన్ సీన్లతో అదరగొట్టాడు. 

అయితే ‘బ్రహ్మోత్సవం’ లో అలాంటి సీన్లు ఉండవని ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే చాల డిఫరెంటుగా ఉండబోతోంది అన్న లీకులు వస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను  విభిన్నంగా ప్రజెంట్ చేస్తున్నాడు అని ఈ సినిమా యూనిట్ వర్గాల సమాచారం. అయితే సినిమా ఘన విజయానికి గుండె కాయలా ఉండే బీసి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులు ఈప్రయోగాన్ని అంగీకరిస్తారా ? అన్న భయం మహేష్ అభిమానులలో మొదలు అయింది అన్న వార్తలు వస్తున్నాయి. 

గతంలో శ్రీకాంత్ అడ్డాల  మహేష్ వెంకటేష్ లతో తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను ఈవిధంగా తీస్తే ఆ సినిమా ఎ సెంటర్ ప్రేక్షకుల సినిమాగా మారిపోయిన విషయాన్ని మహేష్ అభిమానులు గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థుతులలో ఒక సినిమా బ్లాకు బస్టర్ హిట్ గా మారాలి అంటే ఎంతో కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని అవిలేకుండా కేవలం సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని మహేష్ లాంటి టాప్ హీరోతో ప్రయోగాలు చేయడం ఎంత వరకు సమంజసం అని మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కధలతో వస్తున్న సినిమాలు సక్సస్  అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగా పాపులర్ అయితే ఈ సినిమా విజయానికి ఎదురు ఉండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అసలు విషయం ఈ సినిమా ఆడియో విడుదల అయ్యాక తేలిపోతుంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: