ఫ్యామిలీ సభ్యుల మధ్య చిరంజీవి 150వ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాఫ్యామిలీ సభ్యులంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకపోతే పవన్‌కల్యాణ్ లేని‌ లోటు స్పష్టంగా కనిపించిందిఅని టాక్. దీనితో ఈ వేడుకకు పవన్‌కల్యాణ్ ఎందుకురాలేదు ఎండవేడా? ‘సర్దార్’ హీటా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి.  

ప్రస్తుతం  చిరంజీవి 150వ సినిమా  ప్రారంభానికి పవన్ రాకపోవడం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యింది. దీనితో పవన్ తన లేటెస్ట్  మూవీ నిమిత్తం మరేదైనా సిటింగ్ లో వున్నాడా ? అంటూ మరికొందరు సoదేహాలు వ్యక్త పరిచారు. అయితీ ఈ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ కు  చిరంజీవి అతిధిగా వచ్చిన నేపధ్యంలో అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిరింది అనుకుంటున్న  సమయంలో  పవన్ నిన్న ఇలా మరో ట్విస్ట్ మెగా ఫ్యామిలీకి ఎందుకు ఇచ్చాడు అన్న విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభం అయిన రోజునే హీరో నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ ఆ’ సినిమా పాటల విడుదల వేడుకకు పవన్ అతిథిగా వస్తున్నాడు అంటూ స్వయంగా ప్రకటించాడు. ఈ ఫంక్షన్  మే 2న శిల్పకళావేదికలో జరగబోతోంది. 

అయితే ఇటీవల తన కుటుంబానికి సంబంధించిన ఏ వేడుకకీ హాజరు కాని పవన్ తన అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ఓపెనింగ్ కు కూడ వెళ్ళకుండా  నితిన్ ‘అ ఆ’ వేడుకకు అతిధిగా  వస్తానని మాట ఇవ్వడం వెనుక అర్ధాలు ఏమిటి మళ్ళీ పవన్ చిరంజీవిల మధ్య దూరం ఎర్పడుతోందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ కామెంట్స్ చిరంజీవి 150వ సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్ కు ఎంతో కొంత షాక్ ఇస్తుంది అనడంలో సందేహంలేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: