నిన్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవంలో ఈ సినిమాకి  సంబంధించిన తొలి క్లాప్ పరుచూరి వెంకటేశ్వరరావు చేత కొట్టిoచడంలో మెగా కాంపౌండ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ‘కత్తి’ కథ తనదే అని మురుగదాస్ తన స్టోరీని కాపీ కొట్టేసి సినిమా తీసేశాడని నరిసింహారావు అనే వ్యక్తి ఆమధ్య మీడియా  ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈకథని రిజిస్టర్ చేయించిన విషయాన్ని కూడ నరసింహారావు చేపుతున్నాడు. తమిళ ‘కత్తి’ ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ అదేవిధంగా హీరో విజయ్ వల్ల తానూ మోసపోయాను అంటూ మీడియా కు ఎక్కడమే కాకుండా ఈ రచయిత తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో కంప్లెయింట్ చేశాడు. దీనితో మన రచయితలు కుడా బాగానే స్పందించి  ఇష్యూ సెటిల్ అయ్యే వరకూ ‘కత్తి’ చిత్రానికి ఎవరూ సహకరించకూడదంటూ మీడియా సాక్షిగా ఒక ప్రకటన కూడ చేసారు. 

అప్పట్లో ఈ విషయమై దాసరి కూడ స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రెస్ మీట్ కి అధ్యక్షత వహించిన రచియిత  పరుచూరి వెంకటేశ్వరరావు చేత నిన్న చిరంజీవి తన ‘కత్తిలాంటోడు’ సినిమాకు క్లాప్ కొట్టించడం వెనుక చాలా వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది  అని అంటున్నారు. దీనికి కారణం ఈ నరిసింహారావు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు అని టాక్. ఈ విషయాన్ని పరిష్కరిస్తాను అని మాట ఇచ్చిన రచయిత పరుచూరి దర్శకుడు వినాయక్ రచయిత నరిసింహారావుని పట్టించుకోవడం లేదు అని ఫిలింనగర్ టాక్. 

దీనితో ఆ రచియిత నరసింహారావు తిరిగి తన యుద్ధం మొదలు పెట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈనేపధ్యంలో ఎందుకైనా మంచిదని పరుచూరి వెంకటేశ్వరావు సహయాన్ని కూడ చిరూ ‘కత్తి’ రీమేక్ విషయంలో తీసుకోవడానికి వ్యూహాత్మకంగా పరుచూరి చేత క్లాప్ కొట్టించాడు అని టాక్. ఏమైనా మెగా కాంపౌండ్ తెలివి తేటలు మరి ఎవ్వరికీ రావు అనేది నిజం. మరి రానున్న రోజులలో ఈవిషయం ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి..     


మరింత సమాచారం తెలుసుకోండి: