సామాన్యంగా సినిమా రచయితలు టాప్ హీరోల సినిమాల కోసం వ్రాసే కథలు ఫలానా సినిమా కథకు కాపీ అంటూ వివాదాలు రావడమే కాకుండా ఆ వివాదాల పరిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కిన సందర్భాలు కూడ చాల గతంలో చూశాం. అయితే ఒక సినిమా పబ్లిసిటీ కోసం విడుదల చేయ బడ్డ మోషన్ పోస్టర్ కూడ కాపీ వివాదాలలో చిక్కుకోవడం ఇప్పటి లేటెస్ట్ న్యూస్.

ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మింప బడుతున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’ కు సంబంధించి ఇటీవల ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఇందులో మహేష్ బాబు వెరైటీగా ఉన్న మూడు చక్రాల బైకుపై కనిపించాడు. 

ఈ పోస్టర్ ను చూసిన మహేష్ వీరాభిమానులు అంతా ఈ పోస్టర్ చాల బాగుంది అంటూ కామెంట్స్ పెడుతూ వెబ్ మీడియాలో చాల హడావిడి చేసారు. అయితే ఈ మోషన్ పోస్టర్ ఐడియా ఈసినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలది కాదని తేలిపోయింది. రాజస్థాన్ టూరిజం వారు తమ రాష్ట్ర టూరిజమ్ ప్రమోషన్ కోసం ఒక యాడ్‌లో ఇలాంటి మూడు చక్రాల బైక్‌ని వాడారు. 

ఇప్పుడు అదే కాన్సెప్ట్ మక్కీకి మక్కీగా కాపీ కొట్టి ‘బ్రహ్మోత్సవ’ సినిమాలో మహేష్ బాబు మోటార్ బైక్ గా డిజైన్ చేయించి వాడటంతో ఇందులో శ్రీకాంత్ అడ్డాల ఒరిజినాల్టీ ఏముంది అంటూ కొందరు వెబ్ మీడియాలో కామెంట్స్  పెడుతున్నారు. మరి కొందరైతే ‘బ్రహ్మోత్సవం’ సినిమా కథ కూడ ఏదైనా సినిమాకు కాపీనా అంటూ కొందరు మహేష్ వ్యతిరేకులు చేస్తున్న కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: