టాలీవుడ్లో రోజు రోజుకి సినిమాలు వరదల్లా వచ్చి పడుతున్నాయి.. సినిమాలు వస్తున్నా వాటిలో సక్సెస్ శాతం మాత్రం తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం ఊపందుకున్న చిన్న సినిమాలు మరింత క్రేజ్ సంపాదించాయి. ఇక ఈ వారంలోనే చిన్నా పెద్ద సినిమాలు కలుపుకుని మొత్తం 30 సినిమాలు ముహుర్తం పెట్టేశారంటే షాక్ అవ్వాల్సిందే.


స్టార్ హీరో చిన్న హీరో సినిమా ఏదైనా సినిమానే.. ఏ సినిమాకైనా సరే 24 క్రాఫ్ట్స్ వారు పనిచేయాల్సిందే.. అయితే ఈ మధ్య అందరు అన్ని చేసేస్తున్నారు లేండి. ఆ విషయం పక్కనపెడితే ఈ మధ్య ఏకంగా చిన్న పెద్ద సినిమాలు కలిపి దాదాపు 30 దాకా మొదలెట్టారు. ఓ పక్క బాలయ్య వందో సినిమా, చిరు 150వ సినిమా హడావిడి చేస్తుంటే మరో పక్క పవర్ స్టార్, ఎస్.జె సూర్య సినిమా మొదలుపెట్టారు. 


ఇక నందమూరి కళ్యాణ్ రాంతో పూరి కూడా రిలాక్స్ సినిమాను స్టార్ట్ చేసేశారు. అంతేనా వరుణ్ తేజ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా, అల్లు శిరీష్ ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఇలా ఒక్క మెగా హీరోల సినిమాలే వారం గ్యాప్ లో 5 స్టార్ట్ అవడం జరిగింది. అయితే సినిమాల ముహుర్తపు హడావిడి ఎలా ఉన్నా వాటి రిలీజ్ విషయంలో మళ్లీ టెన్షన్ పడాల్సి వస్తుంది.  


ఇవన్ని ఒకేసారి బాక్సాఫీస్ మీద ఎటాక్ చేసేందుకు సిద్ధమవుతాయి. మరి అలా కాకుండా పరిశ్రమ మేలు కోరి అందరు కలిసి తమ సినిమాను బ్రతికించుకునేందుకు ఓ ఒప్పందం ప్రకారం రిలీజ్ చేసుకుంటే మంచింది. మరి రాబోయే రోజుల్లో సినిమాల హడావిడి ఎలా ఉందో ముహుర్తం పెట్టిన సినిమాల హంగామా చూస్తుంటే తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: