’ప్రేమ కథా చిత్రం’ సినిమా ఘన విజయంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారిన హీరో సుధీర్ బాబు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రిన్స్ మహేష్ బాబు అండతో వచ్చినప్పటికీ...కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ...తన కంటూ ఇండస్ట్రీలో ఓ మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలిగాడు సుధీర్ బాబు.

ఇదిలా ఉంటే ఎవ్వరూ ఊహించనంతగా, హందీ ‘బాఘీ’ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి, తెలుగు ప్రేక్షకులని ఆశ్ఛర్యపరిచాడు. 2004 తెలుగులో వచ్చిన ’వర్షం’సినిమా ఆధారంగా టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లు గా హిందీలో వచ్చిన చిత్రం ‘బాఘీ’. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కానీ‘రాఘవ్’ గా సుధీర్ బాబు చేసిన పెర్ఫార్మెన్స్ కి ఇండస్ట్రీ ఫిదా అయిందని అంటున్నారు.

ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఈ మూవీలో నటించటంతో, సుధీర్ బాబు యాక్షన్ బాగుందని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. బాఘీ సినిమా ప్లాప్ గా నిలిచినప్పటికీ... సుధీర్ బాబు యాక్షన్ ని గుర్తించిన బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ...తనకి ఓ క్రేజీ ఆఫర్ ని ఇచ్చిందని అంటున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో మూవీలో సుధీర్ బాబు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

కామెడీ ఎంటర్టైనర్ గా కొనసాగే ఫిల్మ్ లో సుధీర్ బాబు సరసన బలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అఫిషియల్ న్యూస్ వచ్చిన తరువాత, సుధీర్ బాబు ఈ విషయంపై కామెంట్ చేద్దాం అని భావిస్తున్నారు. అందుకే ఈ న్యూస్ ని ప్రస్తుతం ఎవ్వరితోనూ షేర్ చేసుకోవటం లేదని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: