ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కబాలి’ టీజర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ‘కబాలి’ టీజర్ మెస్మరైజింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను సరికొత్త అవతారంలో ఆయన అభిమానులు కోరుకునే విధంగా చూపెడుతూ ఈసినిమా పై ఇంకా అంచనాలు పెంచేస్తున్నారు.

మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా తెల్లని గెడ్డంతో రజినీకాంత్ తనదైన శైలిలో చాల విభిన్నంగా స్టైలిష్ గా కనిపించాడు. రజినీకాంత్ స్టైలిష్ నడకతో ఈ టీజర్ లో కనపడుతూ రజినీ పని అయిపోయింది అని విమర్శించిన వారికి సమాధానం ఇచ్చేలా రజినీకాంత్ బాడీ లాంగ్వేజ్ ఉంది.

‘ఎవడ్రా ఆ కబాలి రమ్మని చెప్పురా అంటూ విలన్ పాత్రధారి కిషోర్ అంటే కబాలి అంటే తమిళ సినిమాల్లోలాగా బొట్టు పెట్టుకుని, లుంగీ కట్టుకుని, ‘కబాలి’  అని పిలవగానే వచ్చి నిలబడి చెప్పన్నా అనే టైప్ అనుకున్నావా ? అంటూ రజినీ కౌంటర్ ఇచ్చే తమిళ డైలాగ్ ఈ టీజర్ కు హైలెట్ గా మారింది. ‘ఈ టీజర్ చూస్తూ ఉంటే రజినీకాంత్ గతంలో నటించిన ‘భాషా’ సినిమాలోని బాడీ లాంగ్వేజ్ గుర్తుకు వస్తోంది.  రజినీ భార్యగా నటిస్తున్న రాధికా ఆప్టే సంప్రదాయ చీరకట్టులో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 

సంతోష్ నారాయణ్ ఎనర్జిటిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ కు ప్రత్యేక ఆకర్షణ. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసినిమాను తెలుగులో కూడ డబ్ చేసి భారీ స్థాయిలో విడుదల చేయబోతున్న నేపధ్యంలో ఈసినిమా విడుదలకు కేవలం ఒక వారం ముందు విడుదల కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ విజయ అవకాశాలను ‘కబాలి’ దెబ్బ తీస్తుందా అనే సందేహాలు కూ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: