నిన్నటి నుంచి ‘బ్రహ్మాత్సవం’ ప్రమోషన్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌, సాంగ్ టీజర్స్ కు మంచి స్పందన వస్తోంది.  దీనితో మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్  ను చూసి  టాలీవుడ్ వర్గాలు అదిరి పోతున్నట్లు టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్త ధియేటర్ రైట్స్ 72 కోట్లకు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది.  

దీనికితోడు ఈసినిమా ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ వెర్షన్ రైట్స్, అన్ని కలిపితే వంద కోట్ల బిజినెస్  మార్కుని అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిన ఈసినిమా బయ్యర్లు లాభాలతో బయటకు రావాలి అంటే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేయాలని టాలీవుడ్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. అయితే ఆ రెంజ్ కి ‘బ్రహ్మోత్సవం’ చేరగలుగుతుందా అన్న విషయమై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయమై ఒక క్లారిటీ మే 7న  ఈసినిమా ఆడియో విడుదల అయ్యాక వస్తుంది అని అంటున్నారు. ఈవార్తలు ఇలా ఉండగా కొద్దిరోజుల క్రితం చిత్రం విడుదలయిన మోషన్ పోస్టర్ రాజస్దాన్ టూరిజం యాడ్ కు కాపీగా ఉంది అని కామెంట్స్ వస్తే  నిన్న విడుదల అయిన టీజర్ లోని ‘మధురం మధురం’ పాట లిరిక్ మొత్తం మధురాష్టకం నుంచి కాపీ కొట్టారు అని కామెంట్స్ వస్తున్నాయి. 

శ్రీ వల్లభాచార్య శ్రీకృష్ణుడుని వర్ణన చేస్తూ రాసిన మధురాష్టకాన్ని  యధాతధంగా ఈ టీజర్ లో వాడటంతో ‘బ్రహ్మోత్సవం’ లో అన్ని కాపీ ఏనా అన్న సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా భారీ బిజినెస్ తో పాటు భారీ అంచనాలు పెంచుకున్న ఈ ‘బ్రహ్మోత్సవం’ హిట్ కాకపోతే ఈసినిమాని నమ్ముకున్న చాలామంది బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: