నిన్నరాత్రి ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రయోగించిన తన మాటల తూటాలు ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారాయి. శిఖరం ఎవరికీ సలామ్ చేయదు అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని మరోసారి తన మాటల శిఖరం పై కూర్చో పెట్టాడు త్రివిక్రమ్. అంతేకాదు పవన్ అభిమానులకు జోష్ ఇచ్చే విధంగా పవన్ ఒక సునామీ, ఒక ఉప్పెన అంటూ తన ఆశల ఆకాశంలోని పిడుగుగా పవన్ ను అభివర్ణించాడు త్రివిక్రమ్. 

ఇదే సందర్భంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ పవన్ తన గుప్పిట్లో ఉన్న వజ్రాయుధంగా పోల్చడం బట్టీ పవన్ తో త్వరలో మరో బ్లాక్ బస్టర్ ను తీయబోతున్నాను అన్న సంకేతాలు ఇచ్చాడు త్రివిక్రమ్. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి పవన్ ను ‘స్నేహ ఋతు పవనం’ అని కామెంట్ చేయడం ఈ ‘అ ఆ’ ఆడియో వేడుకకు హైలెట్ గా నిలిచింది. 

త్రివిక్రమ్ తన మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూ పవన్ తో కలిసి అడుగులు వేస్తూ ప్రయాణిస్తారా అని పవన్ అభిమానులను చూసి అడగడం బట్టి పవన్ రాజకీయ ఎత్తుగడకు అన్ని విధాల సహకరించండి అనే అర్ధాలను తన మాటల ద్వారా పవన్ వీరాభిమానులకు చేరవేయడానికి తన వంతు ప్రయత్నం చేసాడు అనుకోవాలి. మొత్తం మీద చూస్తే పవన్ త్వరలో వేయబోయే రాజకీయ అడుగులకు పవన్ అభిమానులను సిద్ధం చేసే విధంగా త్రివిక్రమ్ ఉపన్యాసం కోన సాగింది. 

త్రివిక్రమ్ స్పీచ్ ని పూర్తిగా విన్న వారు అంతా భవిష్యత్ లో పవన్ తీసుకోబోయే అనేక నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తిగా త్రివిక్రమ్ మారబోతున్నాడా అంటూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆడియో వేడుకకు వచ్చిన చాలామంది పవన్ త్రివిక్రమ్ సమంతల కాంబినేషన్ మళ్ళీ రావాలి అంటూ ప్లకార్డ్స్ చూపెట్టడం బట్టి వీరి ముగ్గురి కాంబినేషన్ లో మరో సినిమా రావాలని అభిమానులు ఎంత ఘాడంగా కోరుకుంటున్నారో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: