‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ తాను మరో మూడు సినిమాలు మించి నటించను అని చెప్పిన నేపధ్యంలో పవన్ దాసరిల సినిమా ఇక అటకెక్కి పోయినట్లే అనుకున్నారు అంతా. అయితే గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బట్టి ఈ మూవీ ప్రాజెక్ట్ కు మళ్ళీ జీవం వచ్చినట్లు కనిపిస్తోంది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ దాసరిల మూవీ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ వారధిగా మారబోతున్నాడు అని టాక్.

బయటకు వస్తున్న వార్తలను బట్టి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ దాసరిల కాంబినేషన్ లో పట్టాలేక్కబోయే సినిమాకు ఒక కథను అందించడానికి అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కు అటు దాసరితోను ఇటు పవన్ తోను ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆగిపోయిన ఈ మూవీ ప్రాజెక్ట్ కు తన కథను అందించి తిరిగి దాసరి ఆశలకు జీవం పోస్తున్నాడని టాక్.

‘అ ఆ’ సినిమా విడుదల అయ్యాక త్రివిక్రమ్ సూర్యాతో చేయబోయే సినిమాకు కొంత టైం గ్యాప్ ఏర్పడుతున్న నేపధ్యంలో ఈమధ్య కాలంలో తన మనసులో మెదులుతున్న మరో కథను పవన్ దాసరిల కోసం ఈ మాటల మాంత్రికుడు బయటకు తీస్తున్నాడని అంటున్నాడు. అయితే కేవలం తాను కథను మాత్రమే ఇస్తానని దర్శకత్వ బాధ్యతలు చేపట్ట లేనని త్రివిక్రమ్ దాసరికి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 

దీనితో పవన్ దాసరిల సినిమాకు సగం సమస్య తీరినా మరో సగం సమస్య తీరవలసి ఉంది అని అంటున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో దాసరి త్రివిక్రమ్ ఇవ్వబోయే కథకు దర్శకుడుని వెతికే పనిలో బిజీగా ఉన్నాడని టాక్. అన్నీ  అనుకూలిస్తే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలాఖరు లోపు ఉంటుంది అని అంటున్నారు. అయితే పవన్ ప్రస్తుతం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తి అయ్యాక దాసరి సినిమా వైపు వస్తాడా లేదంటే ఈ రెండు సినిమాలను ఒకే సారి నడిపిస్తాడా అన్న విషయమై ఇంకా స్పష్టమైన క్లారిటీ దాసరికే లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: