పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం అవగానే ఆ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పవన్ అభిమానులు. ఆ ఆశలను అంచనాలను అందుకోవడంలో ఏమైనా తేడా జరిగితే పవన్ అభిమానులు  తీవ్ర నిరాశలోకి వెళ్ళి పోతారు. ఇప్పుడు లేటెస్ట్ గా అదే జరుగుతోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్లో  ప్రారంభం అయిన సినిమాకు టైటిల్ కన్ఫమ్ అయిందంటూ వెబ్ మీడియాలో విపరీతమైన హడావిడి  జరుగుతోంది. ఫుల్ వైట్ అండ్ వైట్ లో నిలబడి ఉన్న పవన్ ముందు ‘సేనాపతి' అనే టైటిల్ ఉంచి ఫస్ట్ లుక్ ను పవన్ వీరాభిమానులు రిలీజ్ చేశారు. అంతేకాదు ‘నమ్మితే ప్రాణాలిస్తాడు’ అనే ట్యాగ్ లైన్ కూడ క్రియేట్ చేసారు.  

ఈఫస్ట్ లుక్ ను చూస్తూ ఉంటే తాము తమ అభిమాన హీరో పవన్ ను  ఎటువంటి సినిమాలలో ఎలా చూడాలి అనుకుంటున్నాము అనే సంకేతాలను పవన్ అభిమానులు ఏకంగా తమ హీరోకే ఇస్తున్నట్లు ఉంది. పవన్ అభిమానులు సినిమా పోస్టర్ చూస్తే మాత్రం పవన్ లేటెస్ట్ సినిమాను పొలిటికల్ సెటైరికల్ మూవీలా చూడాలని కోరుకుంటున్నారు అని అనిపిస్తోంది. 

ఒకవైపు పవన్ తన లేటెస్ట్ సినిమా కథ ఇప్పటికే ఫైనల్ చేసి ప్రారంభిస్తున్న నేపధ్యంలో అభిమానుల ఊహలలో తన కొత్త సినిమా ఎలా ఉండాలి అన్న సంకేతాలు పవన్ కు చేరడంతో ఈ ఫస్ట్ లుక్ చూసి పవన్ కూడ షాక్ అయ్యాడని టాక్. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’ కథలో మార్పులూ చేర్పులూ చేసి పవన్ కొత్త సినిమా ప్రారంభిస్తున్న సందర్భంలో తన వీరాభిమానులు ఇచ్చిన సూచనలు ఎంత వరకు పాటిస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: