నిన్నరాత్రి జరిగిన ‘అ...ఆ’ అడియో ఫంక్షన్ లో పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడు నితిన్ పవన్ కళ్యాణ్ ను మరీ అతిగా పొగుడ్తూ చేసిన పొగడ్తల హంగామా అతిగా అనిపించిందని ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన కొంతమంది ప్రముఖులే కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ మితిమీరిన పొగడ్తల భజన విని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లు కూడ తమ నవ్వును ఆపుకోలేక తెగ నవ్వడం బట్టి నితిన్ పొగడ్తల భజన శ్రుతిమించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కు నితిన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే అయినా చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పడంతో పవన్ వీరాభిమానులు కూడ నితిన్ స్పీచ్ పట్ల అసహనంతో ఉన్నారని టాక్.  గతంలో తాను నటించిన ‘ఇష్క్’ సినిమా ఆడియో ఫంక్షన్ నాడు తాను చెప్పాలనుకున్న విషయాలను మర్చిపోయానని అంటూ తన స్పీచ్ ని కంటిన్యూ చేస్తూ  ప్రేక్షకులు నవ్వుతూ ఉన్నా తన మాటలను కొనసాగించాడు నితిన్. 

తన కెరియర్ తొలి రోజులలో ‘జయం’ సినిమా ఆడిషన్స్ కు వెళితే డ్యాన్స్ వచ్చా అని దర్శకుడు తేజా అడిగినప్పుడు ఏమి చేయాలో తెలియక వెంటనే ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాల్లోని స్టెప్పులు వేసాను అన్న విషయాన్ని బయట పెట్టాడు నితిన్. ఆ తరువాత దర్శకుడు తేజా ఏదైనా సీన్ చేసి చూపెట్టమంటే తమ్ముడు మూవీలోని శకుంతల అక్కియా సీన్ దించేశాను అంటూ నితిన్ చెపుతున్నప్పుడు అప్పటి వరకు గంభీరంగా ఉన్న పవన్ తెగ నవ్వేసాడు. 

తనకు వరస పరాజయాలు వస్తున్నప్పుడు ‘ఇష్క్’ సినిమా ఆడియోకు అతిధిగా వచ్చి తనకు హిట్ ఇచ్చిన పవన్ సెంటిమెంట్ మళ్ళీ 2016లో కూడ కొనసాగుతూ తనకు సూపర్ హిట్ రాబోతోంది అని నితిన్ చేసిన పొగడ్తల భజన విన్నవారు మాత్రం పవన్ మెప్పు కోసం నితిన్ ఇంత ఎక్కువగా పొగడాలా అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: