ఎన్టీఆర్ తన వరస సూపర్ హిట్ సినిమాలు టెంపర్ , నాన్నకు ప్రేమతో తర్వాత ఇప్పుడు జనతా గ్యారేజ్ తో హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12 న విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించేశారు. కొరటాల శివ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ ఇప్పుడు ఎక్కడ చూసినా సంచలనం గా మారింది. ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది అని ఒక కొత్త సెంటిమెంట్ ని చెబుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.


అప్పట్లో ఎన్టీఆర్ సింహాద్రి అనే బ్లాక్ బస్టర్ ని తీసాడు ఆ సినిమా సెంటిమెంట్ ని జనతా గ్యారేజ్ కి ఆపాదించి సూపర్ హిట్ అయ్యి తీరుతుంది అంటున్నారు వారు. ఆ సినిమా కి సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నీ కేరళ లో చిత్రీకరణ జరిపారు ఆ తరవాత ఎన్టీఆర్ ఏ సినిమా కీ కేరళ వెళ్ళలేదు. సో జనతా గ్యారేజ్ కోసం ఇప్పుడు ఇన్నాళ్ళ తరవాత కేరళ వెళుతున్నాడు మనోడు. ఈ సినిమా కూడా కేరళ లో షూటింగ్ జరపడం తో ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది అనే సెంటిమెంట్ ని ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్ ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: