ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ బ్రహ్మోత్సవం. ఈ మూవీ తరువాత మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ మూవీకి రెడీ అవుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ హాడావిడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువుగానే కనిపిస్తుంది. ఏదైనా మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిందంటే చాలు, ఆ మూవీకి వెంటనే సీక్వెల్ ప్లానింగ్స్ జరిగిపోతాయి. అందులో భాగంగానే, మహేష్ బాబు సైతం ఓ మూవీకి సీక్వెల్ ని కోరుకుంటున్నారు.


గతంలో తను దూకుడు మూవీకి సీక్వెల్ లా ఆగడు మూవీని ప్లాన్ చేసి, రిలీజ్ తరువాత అది డిజాస్టర్ చూడటంతో మహేష్ కొంత మేర నిరుత్సాహ పడ్డారు. అయితే ఈ సారి మాత్రం తను కోరుకుంటున్న మూవీకి సీక్వెల్ తప్పని సరి చెబుతున్నాడు. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ప్రస్తుతం తను నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ బ్రహ్మోత్సవం. ఈ మూవీకి మహేష్ సీక్వెల్ ని కోరుకుంటున్నారు.


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సీక్వెల్ కంపల్సరీ అని మహేష్ అడుగుతున్నాడు. ఎందుకంటే బ్రహ్మోత్సవం మూవీ కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందనే గట్టి నమ్మకం మహేష్ కి ఉందట. అందుకే శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం సీక్వెల్ కి సంబంధించిన లైన్ ని రెడీ చేయాలని మహేష్ ఆర్డర్ వేశాడంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సీక్వెల్ కి సంబంధించిన లైన్ ని సైతం శ్రీకాంత్ అడ్డాల రెడీ చేశాడని అంటున్నారు.


బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ తరువాత మూవీకి వచ్చిన రెస్పాన్స్ ని చూసి శ్రీకాంత్ అడ్డాల, సీక్వెల్ కి సంబంధించిన ఆ స్టోరీని మహేష్ కి వినిపించాలని చూస్తున్నాడు. మొత్తంగా మహేష్ బాబు తను నటించిన బ్రహ్మోత్సవం మూవీకి సీక్వెల్ ని కోరుకుంటున్నాడంటే, ఈ మూవీ ఎంతలా విజయాన్ని సాధిస్తుందో అని ఇప్పటికే అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: