పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం యస్.జె.సూర్య దర్శకత్వంలో రాబోతుంది. యస్.జె.సూర్య అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతో అభిమానం. అందుకే గతంలో సూర్య చేసిన చిత్రాలు డిజాస్టర్స్ ని చూసినప్పటికీ...మళ్ళీ తనకే అవకాశాన్ని ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్.


యస్.జె.సూర్య ఒకవేళ హిట్ మూవీలని ఇస్తే…దాని ఇంపాక్ట్ ఓ 10 సంవత్సరాల వరకూ ఉండిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యస్.జె.సూర్య హిట్ ని ఇస్తాడేమో? అనే నమ్మకంతో పనిచేస్తారని అంటారు. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తరువాత తిరిగి పవన్ కళ్యాణ్, యస్.జె.సూర్య కాంబినేషన్ లో మూవీని చేయటానికి రెడీ అయ్యాడు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ కథా చర్ఛలు జరిగాయి.


ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులపై యస్.జె.సూర్య ఏ మాత్రం హ్యాపీగా లేడని తెలిసింది. అందుకే క్లైమాక్స్ పై వీరిద్దరూ దాదాపు వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. ఈ చర్ఛల్లో భాగంగా పవన్ కళ్యణ్ నుండి ఆలోచనలను షేర్ చేసుకుంటున్న యస్.జె.సూర్య కి షాకింగ్ మీద షాకింగ్ లు తగులుతున్నాయంట.


పవన్ కళ్యాణ్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి అనే విషయాన్ని యస్.జె.సూర్య స్పష్టంగా గ్రహించాడు. గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు, ఇప్పుడు వేరు అన్న భావన యస్.జె.సూర్య కి వచ్చింది. దీంతో కథకి సంబంధించిన క్లైమాక్స్ పై ఇప్పటికే 8 వెర్షన్స్ గా రాసిన యస్.జె.సూర్య, ఇంకో అరడజనుకి పైగా వెర్షన్స్ ని రాసే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: