సూర్య హీరోగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా రాబోతున్న 24 సినిమా సూర్య ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేశాడు.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రన్ టైం ఆడియెన్స్ ను టెన్షన్ పెడుతుంది. ఓ సినిమా ఎలా ఉన్నా తక్కువ టైంలో ఫినిష్ చేసే ఆడియెన్స్ కు అంతగా బోర్ అనిపించదు, కాని ఈ మధ్య సినిమాలన్ని లెక్కకు మించి మరో అర్ధగంట అధికంగా ఉండటంతో ప్ర్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.


ప్రస్తుతం సూర్య 24 కూడా 2 గంటల 40 నిమిషాల పాటు ఉంటుందట. సో ఈ లెక్కన సూర్యను అంతసేపు థియేటర్ లో చూడాల్సిందే. అయితే సినిమ ఇంట్రెస్టింగ్ కథనాలతో సాగిస్తే ఆడియెన్స్ చూసేస్తారు, కాని సినిమా బోర్ ఫీలింగ్ వస్తే కనుక ఈ నిడివే సినిమాకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విక్రం కుమార్ ప్రాజెక్ట్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నాడు. 


ఇక సూర్య అయితే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని ముందే చెప్పేస్తున్నాడు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. టైం మిషన్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, పోస్టర్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.


దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు ముందు రోజే 24 ను అత్యధిక ప్రీమియర్ షోస్ వేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: