తెలుగు సినిమా చరిత్రలో దాసరి ఓ గొప్ప చెరిగిపోని గుర్తని చెప్పాలి. నాలుగున్నర సుధీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు. 1947, మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు దాసరి నారాయణ రావు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే నాటకాలపై ఉన్న ఆసక్తితో అటు వెళ్లిన దాసరి.. రచయితగా.. దర్శకుడిగా నాటకాలను రచించడం జరిగింది.


మధ్యతరగతి వారైన దాసరి చదువునే రోజుల్లో స్కూల్ కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి వారి తండ్రి గారిది. అయితే ఆరవతరగతిలో మొదటి ర్యాంక్ రావడంతో స్కూల్ మాస్టారు సహకారంతో పై చదువులను చదివారు దాసరి నారాయణ రావు. ఇక మద్రాస్ లో సిని ప్రయాణం ఆరంభించిన దాసరి మొదటి సినిమా తాతా మనవడు సూపర్ హిట్ అయ్యింది.  


1972లో వచ్చిన తాతా మనవడు సినిమా ఎస్వీ రంగారావ్, అంజలి, రాజబాబు నటించారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా 1975లో వచ్చిన స్వరగం నరకం సినిమా బంగారు నందిని తెచ్చిపెట్టింది. 70వ దశకంలో 30 సినిమాలను డైరెక్ట్ చేసిన దాసరి అప్పటికే స్టార్ డైరక్టర్ గా అవతరించారు. ఇక 1980 శతాబ్దంలో 74 సినిమాల దాకా తీశారు.


90ల్లో 23, 2000 దశాబ్ధంలో 12 సినిమాలను తీసిన దాసరి నారాయణ రావు అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు దాసరి గారు అప్పట్లోనే కొత్త కళాకారులను ఎంకరేజ్ చేయడంలో ముందుండేవారు.


ఆయన దార్శకత్వ ప్రతిభకు మెచ్చి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 18000 లకు పైగా అభిమాన సంఘాలు ఉండేవి దాసరి గారికి. ఓ దర్శకుడికి ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండటం అదే మొదటిసారి. ఇక ఎన్టీఆర్ తో తీసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు సినిమాలు ఆయన్ను రాజకీయ రంగం వైపు నడిచేలా చేశాయని అన్నారు.  


ఇప్పటికి ఎప్పటికి దర్శకుడు అంటే కాపెట్న్ ఆఫ్ ది షిప్ అని నమ్ముతూ నేటితరం యువ దర్శకులు తనకు నచ్చే సినిమా తీస్తే ఇంటికి పిలిచి మరి ప్రశంసలు అందిస్తున్నారు దాసరి. ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ శివాజి గణేషన్ తో అన్న మాటలను గుర్తుకు చేస్తారు. దర్శకుడు కళాకారులను తయారు చేయగలడు కాని.. హీరో దర్శకుడిని తయారు చేయలేడు అన్న మాటలు ప్రస్థావిస్తారు దాసరి.  


అందుకే ఆయన్ను దర్శకరత్నం అంటారు. దర్శక లోకాన్ని ఆకాశానికెత్తే దర్శక నిఘంటువు దాసరి నారాయణ రావు. దాసరి నారాయణ రావు గారు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇలాంటి రోజులు ఎన్నో రావాలని దాసరి గారు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: