ఒక్క ' ఏ ' కాదు ఏకంగా మూడు ' ఏ ' లతో ఒస్తున్నాడు హీరో సింభూ, ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుపోయిన సింభూ తన కొత్త సినిమాకి మూడు ఏ లు టైటిల్ గా పెట్టుకుని ఒస్తున్నాడు. సాధారణంగా మంచి హాట్ హాట్ సినిమాలకి ఏ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఏ ఏ ఏ అంటే అందులో ఇకెంత రసికత్వం దాచాడో సింభూ అని అంటున్నారు విశ్లేషకులు. ఎప్పుడూ సింభూ సినిమా అంటే రోమాన్స్ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. తెలుగు లో తనని తాను పరిచయం చేసుకున్న మన్మథ లాంటి సినిమాల విషయం లో సింభూ ఇదంతా చూపిస్తూ ఒచ్చాడు. ఇప్పటికీ రొమాంటిక్ హీరో టాగ్ ని క్యారీ చేస్తున్న సింభూ వివాదాలలో బతకడం అలవాటు చేసుకున్నాడు.










ఈ మధ్యనే బీప్ సాంగ్ తో చాలా రచ్చ చేసాడు సింభూ , అరస్ట్ - వారెంట్ అంటూ చాలా పెద్ద గొడవ జరింగింది ఈ వ్యవహారం . ఆ వివాదం ఇంకా సద్దుకోకుండా నే సింభూ ఏ ఏ ఏ అంటూ రెడీ అయిపోతున్నాడు . మరి ఈ టైటిల్ లో ఎలాంటి ఇబ్బంది ఒస్తుందో మహిళా సంఘాలకి. ఇంగ్లీష్ లో x x x అనే పేరుతో ఉంటె పచ్చి బూతు గా అభివర్ణిస్తారు అలాంటిది మనదగ్గర ఏ ఏ ఏ అంటే కూడా అలాంటి అర్ధం ఒస్తుంది ఏమో అని భయపడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: