‘బ్రహ్మోత్సవం’ ఆడియో ఈ నెల 7వ తారీఖున విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈ సినిమాలోని పాటలు ఎలా ఉంటాయి అన్న ఊహలలో మహేష్ అభిమానులు అంచనాలు కడుతూ రోజులు గడుపుతున్న నేపధ్యంలో ఈ సినిమాలోని రెండు పాటలు ఈసినిమా విడుఅల్ కాకుండానే తొలగించారు అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి కొన్ని అనవసరపు సీన్స్ ను కూడ కట్ చేయడానికి ఈ సినిమా యూనిట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. 

ఇక ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ఈమధ్య కాలంలో చాల టాప్ హీరోల సినిమాలు అవి విడుదల అయ్యాక ఆ సినిమా టాక్ ను బట్టి లెంగ్త్ ఎక్కువైందని అనిపిస్తే ఎడిట్ చేయటం జరుగుతోంది. అయితే ‘బ్రహ్మోత్సవం’ విడుదల కాకుండానే గత టాప్ హీరోల సినిమాల అనుభవాల రీత్యా ముందుగానే ఎడిట్ చేస్తున్నారు అని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా నిడివి 2 గంటల 40 నిముషాలు వచ్చిందట. దీనితో షాక్ అయిన మహేష్ ఈ సినిమా నిడివిని 2 గంటల 20 నిముషాలకు కుదించి ఒక 20 నిముషాల సినిమాను తగ్గించమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ కారణాలు వల్ల ‘బ్రహ్మోత్సవo’ లో రెండు పాటలు మరి కొన్ని సీన్స్ తగ్గపోతున్నాయని తెలుస్తోంది.   ఈసినిమాలోని చాల సీన్స్ లో కనీసం నలభైమంది ఆర్టిస్టులు కనిపిస్తారట. ఇంత భారీ తారాగణం ఈసినిమాకు పనిచేస్తూ ఉండటంతో అనుకోకుండానే దర్శకుడు కంట్రోల్ తప్పి ఈసినిమా నిడివి పెరిగిందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బిజినెస్ జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా గ్రాస్ కలక్షన్స్ 120 కోట్లు దాటితే కాని బయ్యర్లు ఒడ్డున పడలేరు అని అంటున్నారు. అంటే ఈసినిమా ‘శ్రీమందుడు’ ను మించిన భారీ హిట్ కొట్టాలి. మరి అంత రేజ్ ఈసినిమాకు ఉందా అన్న విషయం పై టాలీవుడ్ లోని కొన్ని వర్గాలు సందేహాలు వ్యక్త పరుస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: