ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ ధాటికి స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి భారీ డిమాండ్ ఉండటంతో..టాప్ హీరోలు అంతా హీరోయిన్స్ చుట్టూ తిరుగుతున్నారు. కొత్త హీరోయిన్స్ తో ప్రయోగాలు చేసే కంటే, స్టార్ డం ఉన్న హీరోయిన్స్ తో మూవీలను చేస్తేనే బాక్సాపీస్ వద్ద మంచి ఫలితం ఉంటుందనేది నిర్మాత ఫీలింగ్ కూడ.


ఈ డిమాండ్ ని గమనించిన హీరోయిన్స్ సైతం, వారికి కావాల్సిన పనులను నిర్మాతల చేత చక్కగా చేయించుకుంటున్నారు. ఆ విధంగానే ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ కృతి సనన్, ఓ నిర్మాతకి తనకు కావాల్సిన పనులను చేయించుకోవాలని చూసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస మూవీలను చేస్తున్న కృతి సనన్, తన చెల్లెలని సైతం ఇండస్ట్రీలోకి తీసుకురావాలని చూస్తుంది.


తన చెల్లెలు’నుపుర్’ ని సినిమా హీరోయిన్ గా చేయడానికి కృతి సనన్ చేయని ప్రయత్నం లేదు. కృతి సనన్ అందుకు బాగా ఆలోచించి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ప్రొడ్యూసర్ తో చెల్లలి వ్యవహారాన్ని మాట్లాడింది. ఓ యంగ్ హీరో మూవీలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వాలని కృతి సనన్, ఆ ప్రొడ్యూసర్ కి చెప్పింది. అందుకు ఆ ప్రొడ్యూసర్... కృతి సనన్ చెల్లని నుపుర్ తో ఓ హాట్ ఫోటోషూట్ చేయించాడు.


అంతే కాకుండా కొన్ని అసభ్యకమైన సంభాషనలు కూడ చేశాడని ఫిల్మ్ నగర్ లోనూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కృతి సనన్, వెంటనే ఆ నిర్మాతకి ఫోన్ చేసి ఫుల్ గా క్లాస్ పీకిందట. ఇండస్ట్రీలో ఎదురయిన ఈ అనుభవానికి కృతి సనన్ చెల్లలు నుపుర్ షాక్ నుండి ఇంకా తేరుకోలేదని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: