ఓ పక్క మాస్ ఊర మాస్ అంటూ సరైనోడు సర్రున దూసుకెళ్తుంటే మరో పక్క సుప్రీం డోంట్ సౌండ్ హార్న్ అంటూ వచ్చాడు సాయి ధరం తేజ్. పటాస్ తో దర్శకుడిగా మొదటి సినిమా అయినా సరే సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపూడి చేసిన రెండో ప్రయత్నం కూడా మంచి సక్సెస్ అనే చెప్పాలి. సినిమాలు తీయడం అందరు తీస్తారు కాని ఆడియెన్స్ పల్స్ పట్టుకుని సినిమాలు తీసే దర్శకులు కొందరే ఉంటారు కచ్చితంగా అలాంటి దర్శకుల్లో అనీల్ చేరిపోతాడు.


సుప్రీం సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి రిలీజ్ వరకు అనీల్ అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. మెగా మేనళ్లుడు కెరియర్ పీక్స్ లో ఉన్న ఈ సమయంలో మెగా అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా ఈ సినిమా నిలబడింది. సినిమా టాక్ అన్ని చోట్ల పాజిటివ్ గానే ఉంది. ఇక కలక్షన్స్ అయితే సాయి ధరం తేజ్ కు మెగా అభిమానుల అండదండలు ఎంతున్నాయి అన్నది తెలియచేస్తున్నాయి.


సినిమా ఎంటర్టైన్ పంథాలో సాగించాలి కాని చెప్పాలనుకున్న పాయింట్ చెప్పి తిరాలి . ఇలాంటి సమయంలో చాలా మంది అనవసరమైన అతుకుల కామెడీతో సినిమాలు తీయడం మనం ఇదవరకే చూశాం. కాని అనీల్ మాత్రం సినిమాలో కామెడీ ఉంచుతూనే దాన్ని కడుపుబ్బా నవ్వేలా చేస్తున్నాడు. రెండో సినిమా అయినా సరే దర్శకుడిగా మంచి అనుభవం ఉన్న వాడిగా అనీల్ ప్రత్రిభ కనబరించాడు.
మెగా మేనళ్లుడు సుప్రీం హీరోగా నిలబెట్టడంలో తన టాలెంట్ చూపించిన అనీల్ కు విజిల్ వేసుకోవచ్చని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: