‘బ్రహ్మోత్సవం’ విడుదల తేది ఖరార్ అయింది. రేపు జరగబోతున్న ఈసినిమా ఆడియో ఫంక్షన్ లో మహేష్ ఈసినిమా విడుదల తేదీని స్వయంగా ప్రకటిస్తాడని తెలుస్తోంది. దీనితో ఈసినిమా ప్రమోషన్ కోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నిమార్గాలను పివిపి నిర్మాణ సంస్థ అనుసరిస్తూ ‘బ్రహ్మోత్సవం’ సినిమాను భారీగా ప్రమోట్ చేసి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని ప్రయత్నిస్తోంది. 

ఈప్రయత్నాలలో భాగంగా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ చేత ఆమె ట్విటర్ ఎకౌంట్ ఓపెన్ చేయించి ‘బ్రహ్మోత్సవం’ సినిమా విషయాలను ఆమె ట్విటర్ ద్వారా కూడ అభిమానులకు చేరవేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈసినిమా నిర్మాణ సంస్థ. అయితే ఇక్కడ కూడ కాజల్ చాల బిజినెస్ పరంగా ఆలోచించింది అన్నవార్తలు వస్తున్నాయి. గతంలో ఈమె నటించిన చాల సినిమాల విషయంలో ఎక్స్ పోజింగ్ చేయడానికి లిప్ లాక్ లు ఇవ్వడానికి తనకు ఇచ్చే పారితోషికమే కాకుండా ఇంకా అధికంగా పారితోషికం కావాలి అని నిర్మాతలను కాజల్ ఖంగారు పెట్టింది అన్న వార్తలు ఉన్నాయి. 

దీనితో ఆమెను చాలామంది టాలీవుడ్ నిర్మాతలు దూరం పెట్టారు. అయితే కాజల్ తన పారితోషిక విషయంలో తనపట్టును సడలించు కావడంతో మళ్ళీ ఆమెకు అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. ఆ నేపధ్యంలోనే ఆమెకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే ఈబ్యూటీ ట్విట్టర్ లోకి రావడానికి కూడా డబ్బులు వసూలు చేసిందని టాక్. ఇప్పటి వరకు కేవలం ఫేస్ బుక్కులో మాత్రమే సందడి చేస్తున్న కాజల్ ఇప్పుడు సొంత ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి ‘బ్రహ్మోత్సవం’ సినిమా పోస్టర్ ను ట్వీట్ చేసి తన హడావిడి మొదలు పెట్టింది. 

అయితే ఆశ్చర్యకరమైన రూమర్స్ ప్రకారం ఇలా తన ట్విటర్ లో అడుగుపెట్టి బ్రహ్మోత్సవాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు నిర్మాత పివిపి దగ్గర అమ్మడు బాగానే వసూలు చేసిందని టాక్. ఈవార్తలలో ఎంత నిజముందో తెలియకపోయినా ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న ఈగాసిప్పులు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈమధ్యన ట్విట్టర్ లో వివిధ ప్రాడక్టులను ప్రమోట్ చేయడానికి తమన్నా, తాప్సీ, వంటి హీరోయిన్లు డబ్బులు తీసుకుని ట్వీట్స్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బహుశా కాజల్ వీరిని ఆదర్శంగా తీసుకుంది కాబోలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: