పోర్న్ బ్యూటీ సన్ని లియోన్ ఏ ముహుర్తాన బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిందో కాని అప్పటి నుండి అమ్మడు చాలా మారింది. మొదట సినిమాల్లో స్పైసీ నెస్ ఎక్కువగా ఉండేలా చూసుకున్న అమ్మడు రాను రాను సినిమాల్లో కాస్త నటించడం కూడా నేర్చుకుంది. ఇక రానున్న రోజుల్లో అసలు హాట్ మూవీస్ జోకిలి పోనంటూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.


ఇన్నాళ్లు తన అందచందాలతో ఆకట్టుకున్న సన్ని ఇప్పుడు సడెన్ గా అలాంటి సినిమాలు చేయాలనుకోవట్లేదు అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరించింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం అమ్మడు స్టార్ హీరోల సరసన నటిస్తుంది కాబట్టి బడా హీరోల సినిమాల్లో స్పైసీ సీన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసే అవకాశం ఉండదు అందుకే సన్ని ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు.


అయితే తనని అలానే చూడాలని కోరుకునే అభిమానుల కోసం మంచి కథలు దొరికితే నటిస్తా అంటుంది. ఇటీవల నటించిన మస్తీజాదే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. అయితే సన్ని నటించిన వన్ నైట్ స్టాండ్స్ లో మళ్లీ శృతి మించిన శృంగారం చేసినట్టే తెలుస్తుంది.


ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా సన్నికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. అంతేకాదు తెలుగులో కరెంటు తీగ సినిమాలో నటించిన సన్ని మరో సినిమాలో కూడా ఓకే అయినట్టు సమాచారం. మరి సన్ని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు బాధనిపించినా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం హమ్మయ్య అని అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: