ఛార్మీ ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుందని కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రియ కూడా ఐటమ్ నంబర్లలో డాన్సులు చేస్తుందనీ కొత్తగా చెప్పక్కర్లేదు. మరి, కొత్త విషయం ఏంటంటే... ఛార్మి చిత్రంలో శ్రియ ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఛార్మి ‘జిల్లా గజియాబాద్’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది కదా. ఆ సినిమాలో ఓ పాటలో ఆడిపాడేందుకు శ్రియ ఓకే చెప్పింది. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్. ఆమె ఓ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ‘ఈ చిత్రం కథ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి పాత్రల్లో నేనెప్పుడూ నటించలేదు’ అని ఛార్మి చెబుతోంది.  ‘బాలీవుడ్ లో ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ లో నటించిన తారలకు ఎంత క్రేజ్ దక్కుతోందో అందరికీ తెలిసిందే. అందుకే నేను కూడా ఈ పాటలో డాన్స్ చేసేందుకు ఒప్పుకొన్నాను’ అంటోంది శ్రియ. 

మరింత సమాచారం తెలుసుకోండి: