మహేష్ బాబు కెరియర్ ఇప్పుడు అంత వేగంగా దూసుకు పోవడం వెనుక మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ సలహాలు బాగా పనిచేస్తున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈరోజు విడుదల అయిన ‘బ్రహ్మోత్సవం’ మూవీ ప్రమోషన్ విషయాలలోనే కాదు ఈసినిమా బ్రాండింగ్ ఇమేజ్ ని పెంచడంలో నమ్రత వేసిన ఎత్తుగడలు చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత బాగున్నా ఆప్రోడక్ట్ ను సరిగ్గా బ్రాండింగ్ చేసుకుని ప్రచారం చేసుకోకపోతే ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్రమైన పోటీలో నిలదొక్కుకోవడం చాల కష్టం. ఇలా చేయడానికి చాల స్ట్రాటజీలు ఉండాలి. ఒక సినిమా టైటిల్ ఇమేజ్ ని తమ ప్రొడక్ట్స్ బ్రాండింగ్ కు వాడుకుంటూ ప్రచారం చేయడం అనేది ఒకప్పటి పద్ధతే అయినా దాని విధానం మార్చి ఒక కొత్త వ్యూహంతో కొన్ని ప్రొడక్ట్స్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాను తమ ప్రొడక్ట్స్ సేల్స్ కు ఉపయోగించుకోవడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఈమధ్య ఒక చెప్పుల షాపు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ తన తండ్రి కాళ్ళకు చెప్పులు తొడిగే సీన్ ను బీభత్సంగా వాడుకుని తమ చెప్పుల బ్రాండ్ ను విపరీతంగా ప్రమోట్ చేసుకుంది. ఈరోజు ‘బ్రహ్మోత్సవం’ విడుదల అవుతున్న సందర్భంగా ఆ చెప్పుల షాపు అన్ని పేపర్లలో ఫుల్ పేజీ యాడ్స్ కూడ ఇచ్చింది. 

ఈవిధంగా మహేష్ స్టిల్ ను వాడుకున్నందుకు ఆ చెప్పుల కంపెనీ మహేష్ కు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్.  ఇది ఇలాఉండగా  ఒక ఎడిబుల్ ఆయిల్ కంపెనీ లేటెస్ట్ గా ఆ ఆయిల్ తాలూకు పోస్టర్లలో ‘బ్రహ్మోత్సవం’ సీన్స్ ను కలిపి తమ పోస్టర్లలో వేసుకుంటూ తమ ఆయిల్ ప్రోడక్ట్ కు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు ‘బ్రహ్మోత్సవం’ విడుదలైన ధియేటర్లలో ఈబ్రాండింగ్ తాలూకు ప్రచార ప్రభావం కనిపిస్తోంది. దీనితో ‘బ్రహ్మోత్సవం’ టైటిల్ ఇమేజ్ ఎన్ని బ్రాండ్ లకు ఇలా ఉపయోగపడుతుంది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: