పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు ముందు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పబ్ లో తన పుట్టినరోజు వేడుకలను తన స్నేహితులతో ఆత్మీయులతో గడిపినట్లుగా వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తన స్నేహితులతో జూనియర్ బాగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ పబ్ లో అర్దరాత్రి వరకు జోనియర్ టైం స్పెండ్ చేసినట్లు టాక్. 

అయితే ఎప్పుడూ పుట్టినరోజును తన ఫ్యామిలీతో గడపడానికి ప్రాధాన్యం ఇచ్చే జూనియర్ ఇలా తన అలవాటుకు భిన్నంగా ఒక పబ్ లో కొంత సేపు కాలం గడిపాడు అని వార్తలు రావడంతో జూనియర్ మారిపోయాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ కు ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ అభిమానుల్లో విపరీతమైన స్పందన వచ్చింది. 

కేవలం జూనియర్ అభిమానులకే మాత్రమే కాకుండా మిగతా వారికి కూడ ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ బాగా నచ్చడంతో జూనియర్ ఈ సినిమాకు సంబంధించి మొదటి పరీక్ష పాస్ అయ్యాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎట్టి పరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలి అన్న పట్టుదలతో జూనియర్ నటిస్తున్న ఈసినిమా బిజినెస్ ఈ సినిమా నిర్మాణం పూర్తి కాకుండానే భారీ స్థాయిలో జరగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈమధ్య కాలంలో టాప్ హీరోలు నటిస్తున్న సినిమాలు సరైన విజయాలు సాధించలేకపోతున్న నేపధ్యంలో జూనియర్ ఈసినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీడియా వర్గాలను మంచి చేసుకోవడానికి ఈమధ్య తరుచు మీడియా వారికి భారీ పార్టీ ఇస్తూ మీడియాలో తన పై ఎటువంటి నెగిటివ్ ప్రచారం జరగకుండా చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు జూనియర్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: