బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ రేస్ లో ఉన్నది దీపికా పదుకొణె,ప్రియాంక చోప్రా. మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొని ఓంశాంతి ఓం చిత్రం తర్వాత వీపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆమె తండ్రి  ప్రకాష్ పడుకోణె  అంతర్జాతీయ ఖ్యాతిగల బ్యాడ్మింటన్ ఆటగాడు. కాలేజీ రోజుల్లో ఉండగా పడుకోణె మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. కొద్ది సంవత్సరాల్లో, ఆమె ప్రముఖ ఉత్పత్తులైన  లిరిల్ , డాబర్ , లాల్ పౌడర్, క్లోసప్ టూత్ పేస్టు, మరియు లిమ్కాలకి మోడలింగ్ చేసింది. ఇండియా రిటైల్ జ్యువెలరీ షో యొక్క ఆభరణములకు "బ్రాండ్ అంబాసిడర్"గా కూడా వ్యవహరించింది.  

దీపీకా పదుకొణె


మోడలింగ్‌లో విజయవంతమైన తరువాత, పడుకోణె నటన వైపు దృష్టి సారించింది.  2006లో, పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన చిత్రం  ఓం శాంతి ఓం మంచి పేరు తెచ్చింది.  తాజాగా ఈ అమ్మడు ‘ట్రిపులెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా దీపిక ఇచ్చిన బహుమతి ఎంతో బాగుందని దర్శకుడు డి.జె. కరుసో తెలిపారు.

దీపికి పదుకొణె బహుబతి


ఆ బహుమతికి కురుసో ఎంతో ముచ్చటపడిపోయాడు.ఈ సందర్భంగా దీపికా పదుకునే ఇచ్చిన భారతీయ సంప్రదాయ కుర్తా, పైజామా, షూస్ వేసుకుని స్టైల్ గా తయారవ్వాలని అనుకుంటున్నట్టు ఆయన అన్నారు. ఈ విషయాన్ని కరుసో తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఆ దుస్తుల ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘దీపికా గిఫ్ట్‌ బాగుంది. బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్స్‌.. ఇప్పుడు నేను ఈ డ్రస్‌తో స్టైల్‌గా తయారవ్వాలి..’ అని కరుసో ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: