ప్రపంచ వ్యాప్తంగా 87 కోట్ల బిజినెస్ చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’  చిట్టచివరకు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల నెట్ కలెక్షన్స్ ను రాబట్టడంతో ఈసినిమా బయ్యర్లకు 35 కోట్ల  నష్టాలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక భయంకరమైన ఫ్లాప్ సినిమాకు ఈరేంజ్ లో కలెక్షన్స్ రావడం ఆశ్చర్యం అయినా ఇంత భారీ స్థాయిలో వచ్చిన  నష్టాన్ని పవన్ లేటెస్ట్ సినిమా  ‘హుషారు’ ఎంత వరకు మోయగలుగుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
సర్దార్’ కొనుక్కుని తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లకు పవన్ తాను  ఎస్.జె. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా రైట్స్ ను 25% తక్కువ ధరకు ఇచ్చే ప్రపోజల్ ను పవన్ ‘సర్దార్’ బయ్యర్లకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పవన్ లేటెస్ట్ మూవీ ‘హుషారు’ అనుకున్న విధంగా సూపర్ హిట్ అయినా తాము ‘సర్దార్’ సినిమాలో పోగొట్టుకున్న నష్టాలను కవర్ చేసే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా పవన్ లేటెస్ట్ మూవీ ‘హుషారు’ ఎంత వరకు నిలబడుతుంది అన్న భయం ఈసినిమాను కొనుక్కోబోతున్న డిస్ట్రిబ్యూటర్లను వెంటాడుతోంది అని టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఎస్.జె. సూర్యల లేటెస్ట్ మూవీకి సంఖ్యా శాస్త్ర రీత్యా కూడ మూడు అక్షరాల సెంటిమెంట్ కలిసి వస్తుంది కాబట్టి ఈసినిమాకు ‘హుషారు’ అన్ని విధాలా సరిపోయిన టైటిల్ అనే భావనలో పవన్ ఉన్నట్లు టాక్. తనకు బాగా కలిసి వచ్చిన శ్రుతిహాసన్ సెంటిమెంట్ తో పాటు తనకు గతంలో సూపర్ హిట్స్ ను అందించిన తమిళనాడులోని పొల్లాచి లో జూన్ 2వ ఈసినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

రచియిత ఆకుల శివ ఈసినిమాకు వ్రాసిన డైలాగ్స్ పవన్ అభిమానులకు నచ్చడమే కాకుండా పవన్ భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని తెలియచేసే అర్ధం వచ్చే విధంగా చాల పవర్ ఫుల్ డైలాగ్స్ ఈసినిమాలో ఉంటాయని టాక్. ఈ సినిమాను అత్యంత వేగవంతంగా పూర్తిచేసి ఈ సంవత్సరం చివరకు కాని లేదంటే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కాని విడుదల చేయాలి అన్న వేగంతో పవన్ ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: