వెండితెర మన్మథుడు నాగార్జున టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నేటితో 30 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్’ 1986 మే 23న విడుదలైంది. ఈ 30 సంవత్సరాల ప్రస్థానంలో నాగార్జున పోషించిన డిఫరెంట్ పాత్రలు నేటితరం హీరోలలో ఎవరూ పోషించ లేదు. ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టుగా ఒక్కో సినిమాకు తన గెటప్‌ని మార్చేస్తూ సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తో తన రేంజ్ ని మరోసారి చాటుకున్నాడు. 

ఇక ‘ఊపిరి’ లో బిలియనీర్‌ విక్రమాదిత్య రోల్‌లో వీల్ చైర్ పై నటించి సామాన్యులతోపాటు విమర్శకుల్ని సైతం ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన రూట్ మార్చి ‘బాబా హాథీరామ్‌’ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ‘అన్నమయ్య’, ‘రామదాసు’, ‘షిర్డీసాయి’ వంటి పాత్రల్లో నాగార్జునను చూపించిన దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇప్పుడు ‘హాథీరామ్‌’ గా కనపడబోతున్నాడు.

నార్త్ ఇండియన్ అయిన హాథీరామ్‌ తిరుపతిలో స్థిరపడి, వెంకటేశ్వరస్వామి మహాభక్తునిగా పేరుపొందారు. ఆయన పాత్రలో ఇప్పుడు నాగార్జున కనిపిస్తూ భక్తుడు హాథీరామ్‌కు తగ్గట్టుగానే గెటప్ మార్చేశాడు. నాగార్జున‌ని ఈలుక్‌ లో చూసిన ఫ్యాన్స్ షాక్ కు గురి అవుతున్నారు అని టాక్. 

నటనలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున తన భార్య అమలతో కలిసి కెమేరాకు పోజు ఇచ్చిన ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. అంతేకాదు తన 30 ఏళ్ల నట ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను తన తన తండ్రిని తల్లిని మిస్ అయ్యానని మరోసారి వాళ్ళను గుర్తుకు చేసుకుంటూ తన భావాలను పంచుకున్నాడు నాగ్. వెంతటేశ్వర స్వామి స్వయంగా భూమి పైకి వచ్చి తిరుపతిలో స్థిరపడిన హాథీరామ్ ఇంటికి వెళ్ళి ఆయనతో పాచికలు ఆడేవారు అనే కథలు ఉన్నాయి. మరి నాగ్ ఈపాత్రలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: