తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలు గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్, మహేష్ బాబు చిత్రాలంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.   మహేష్ బాబు ఒక్క సినిమాల్లోనే కాకుండా యాడ్స్ లో నటిస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదిస్తే.. పవన్ కళ్యాన్ రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రతేకత ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ ఇద్దరు హీరోలకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఇక పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెంచేసిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్రంతో పవన్ కళ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.  తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రమైన ‘అత్తారింటికి దారేది ’ చిత్రంతో అటు మాస్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారు.

సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాన్


ఈ చిత్రం తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంతో ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పవన్ అంటే విపరీతంగా అభిమానించే అభిమానులు రెండు సంవత్సరాల తర్వాత తమ హీరో నటిస్తున్న సినిమాపై విపరీతమైన అంచనాలు వేసుకున్నారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మొదటి రోజు నుండే డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపడుతుంది అనుకున్నారు. కానీ అలాంటి టాక్ వచ్చినా కానీ ఏకంగా యాభై కోట్ల మార్క్ దాటడం నిజంగా గ్రేట్.  


సర్ధార్ గబ్బర్ సింగ్ 


ఈ సినిమా ప్రపంచవ్యాన్తంగా దాదాపుగా 52.2 కోట్లు రాబట్టింది. అందులో కోస్తా జిల్లాల నుండి 20.82 కోట్లు, సీడెడ్ నుండి 8.40 కోట్లు, నైజాం నుండి 12.05 కోట్లు వచ్చాయి. యుఎస్ఎలో 3.90 కోట్లు, కర్ణాటక నుండి 4.55 కోట్లు, మిగిలిన చోట్ల (ఇండియాలో)1.40 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ఏరియాల నుండి 1.08 కోట్లు రాబట్టింది. సర్ధార్ గబ్బర్ సింగ్ ప్లాఫ్ అని టాక్ తెచ్చుకున్నా కానీ యాభై కోట్ల మార్క్ దాటిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్ కళ్యాన్ మరోసారి ట్రెండ్ సెట్ చేశాడని అభిమానులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: