మాటల మాంత్రికుడు సినిమా మనిషి. ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడాలని ఆలోచించే మనిషి. అందుకే త్రివిక్రమ్ ఎప్పుడూ తన మూవీలని ఏ మూవీలకి పోటీ లేకుండా రిలీజ్ చేసుకోవాలని చూస్తుంటాడు. అలాగే...తన మూవీకి ఏ మూవీ పోటీ రాకుండా చూసుకుంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాపీస్ మార్కెట్ వద్ద సందడి చేస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ మూవీ ప్రేక్షకులు ఆశించినంత సక్సెస్ ని చూడలేకపోవటంతో...తక్కువ సమయంలోనే ‘అ..ఆ’ మూవీని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు.


అయితే అందుకు త్రివిక్రమ్  ఏ మాత్రం ఒప్పుకోలేదు. బ్రహ్మోత్సవం మూవీకి కనీసం రెండు వారాల టైం ఇవ్వాలని, ఆ తరువాతనే తను తెరకెక్కించిన ‘అ..ఆ’ మూవీని రిలీజ్ చేయాలని చెప్పుకొచ్చాడంట. దీంతో త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయం కారణంగా... ‘అ..ఆ’ మూవీ రిలీజ్ వరకూ థియోటర్స్ వద్ద బ్రహ్మోత్సవం సందడి మాత్రమే ఉంటుంది. ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన ‘అ..ఆ’ మూవీ ఆడియో, ట్రైలర్‌ ఇండస్ట్రీలో అంచనాలను పెంచేసింది.


ఇప్పుడు ఈ మూవీ జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కావటంతో ఆ రోజు బెటర్ అని త్రివిక్రమ్ భావించాడు. మొత్తంగా బ్రహ్మోత్సవం మూవీపై పోటీ కాకుండా, కొంత సమయం తీసుకుని రావాలని త్రివిక్రమ్ ఆలోచించటం..మహేష్ కి కొంత గ్యాప్ ఇచ్చినట్టుగా అయింది.


మహేష్ బాబుకి, త్రివిక్రమ్ కి మధ్య మంచి పరిచయాలు ఉండటంతో.... ‘అ..ఆ’ మూవీని త్రివిక్రమ్ లేటుగా రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ‘అ..ఆ’ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: