‘బ్రహ్మోత్సవం’ షాక్ కు పివిపి నిర్మాణ సంస్థ ఏకంగా సినిమా రంగానికే గుడ్ బై చెపుతుందా ? అనే  కామెంట్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. పివిపి సంస్థ సినిమాలు తీయడం మొదలు పెట్టాక ఒక్క ‘క్షణం’ సినిమాలో తప్ప మరే సినిమాలలోను లాభాలు పొందలేదు అనే కామెంట్స్ ఉన్నాయి. కొద్ది  కాలం క్రితం అనుష్కతో ‘వర్ణ’ సినిమాను నిర్మించిన పివిపి ఆ సినిమా వల్ల భారీ నష్టాలను చవిచూసింది. 

అనుష్క వల్ల వచ్చిన నష్టాలను తిరిగి అనుష్క వల్లే లాభాలుగా మార్చుకోవాలని గత సంవత్సరం ‘సైజ్ జీరో’ సినిమా ద్వారా ప్రయత్నిస్తే అది కూడ పివిపికి పీడ కలలా మారింది. ఈ సంవత్సరం విడుదలైన ‘ఊపిరి’ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆసినిమా పై దర్శకుడు వంశీ పైడిపల్లి ఖర్చు పెట్టిన భారీ బడ్జెట్ తో  ఆసినిమా విజవంతం అయి కూడ పివిపికి పెద్దగా కలిసిరాలేదు అని అంటారు. ఇక ఈ నిర్మాణ సంస్థ ఎన్నో ఆశలతో గతవారం విడుదల చేసిన ‘బ్రహ్మోత్సవం’ భయంకరమైన ఫ్లాప్ గా మారడమే కాకుండా ఈసినిమా వల్ల దాదాపు 40 కోట్ల నష్టం బయ్యర్లకు వస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇలా వరస పెట్టి వస్తున్న పరాజయాలతో సినిమా నిర్మాణం పట్లముఖ్యంగా దర్శకుల పట్ల పివిపికి నమ్మకం సన్న గిల్లుతోంది అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాను నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చూడటమే కాకుండా ఆ సినిమా పై ప్రశంసలు కురిపించాడు. 

పివిపి అభ్యర్ధన మేరకు వెంకయ్యనాయుడు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ప్రత్యేకంగా చూడటం పట్టి పొట్లూరి ఇక సినిమాలు తగ్గించుకుని భారతీయ జనతా పార్టీ వైపు తన దృష్టిని పెట్టి ఇక రాబోయే కాలంలో రాజకీయాలలో చురుకుగా ఉంటారా అనే అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. సినిమాల పట్ల అభిరుచితో మంచి సినిమాలు తీయాలి అన్న ఉద్దేశ్యంతో పివిపి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవ్వడం చూస్తూ ఉంటే టాలీవుడ్ సినిమా రంగo  మరో మంచి నిర్మాతను పోగొట్టుకుంటుందా అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: