టాప్ హీరోల సినిమాల ఫలితాలు తేలిపోవడంతో ఇప్పుడు ఇక అందరి దృష్టి జూన్ 2న విడుదల కాబోతున్న ‘అ..ఆ' పై పడింది. నిన్నటి వరకు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ప్రమోట్ చేసిన సమంత ఆ సినిమా ఫలితం తేలిపోవడంతో ఇక తన దృష్టి ‘అ ఆ’ పై పెట్టింది. 

అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ నిన్న అన్ని ప్రముఖ పత్రికలకు ఇచ్చిన యాడ్ లో ఆ యాడ్ పోస్టర్ మధ్యలో నితిన్ ముఖం పెట్టి చుట్టూ సమంత అభినయాలతో కూడిన బోలెడన్ని ముఖాలు పెట్టి సమంతను హైలెట్ చేస్తూ యాడ్ విడుదల చేసారు. అయితే ఈ యాడ్ హీరో నితిన్ కు అనుకోని షాక్ ఇచ్చింది అని టాక్. సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో కేవలం సమంతను మాత్రమే హైలెట్ చేస్తే సినిమాకు ఓపెనింగ్స్ ఎలా వస్తాయి అని నితిన్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. 

దీనికి కారణం ఈమధ్య సమంత నటించిన సూర్య ‘24’ మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలలో సమంత లుక్ ను చూసి ఆమె మొఖానికి ఏమైంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అదీ కాకుండా సమంత వల్ల ‘24’ – ‘బ్రహ్మోత్సవం’ సినిమాలకు పెద్దగా కలిసి వచ్చింది లేదు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా నితిన్ ను పక్కన పెట్టి సమంతను మాత్రమే ప్రమోట్ చేస్తే తనకు ఏమి ప్రయోజనం అని నితిన్ మధన పడుతున్నట్లు టాక్. 

అయితే ఈ సినిమాను సమంత మ్యాజిక్ కంటే త్రివిక్రమ్ చేసే మ్యాజిక్ తోనే ఒడ్డున పడుతుందని ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఆశ పడుతున్నారు. ఈ సమ్మర్ కు విడుదలైన రెండు భారీ సినిమాలలో సమంత నటించినా వాటి వల్ల సమంత క్రేజ్ కు ఏ మాత్రం ప్రయోజనం లేదు. దీనిని బట్టి చూస్తూ ఉంటే జూన్ లో విడుదల కాబోతున్న ‘అ ఆ’ ఫలితం బట్టి సమంత కెరియర్ తో పాటు ఆమె పెళ్ళి చేసుకునే నిర్ణయం కూడ ఆధారపడి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: