కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన రాజమౌళి తన హాలిడే మూడ్ నుండి బయటకు వచ్చి ‘బాహుబలి 2’ క్లైమాక్స్ చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తున్నాడు. క్లైమాక్స్ షూట్ చేస్తే ‘బాహుబలి 2’ కు సంబంధించిన ప్రధానమైన షూటింగ్ అంతా పూర్తి అవుతుంది అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి ది కంక్లూజన్’ ను కంక్లూడ్ చేయడంలో తలమునకలయ్యాడు అని టాక్. 

దీనికి సంబంధించి రాజమౌళి ఈసినిమా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కణల్ కణ్ణన్ తో కలసి తదుపరి చేయించవల్సిన కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి తీవ్రంగా చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా క్లైమాక్స్ సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కావడంతో ఆ షూటింగ్ ను ఎక్కడ జరపాలి ఎటువంటి టెక్నాలజీ వాడాలి అనే విషయం పై కూడ రాజమౌళి లోతుగా చర్చలు జరుపుతున్నట్లు టాక్. 

ఇప్పటికే ప్రభాస్ తన సమ్మర్ ట్రిప్ నుండి తిరిగి వచ్చి ‘బాహుబలి 2’ కోసం సిద్దంగా ఉన్నాడు. ఇక అనుష్క బెంగుళూర్ లో తన కుటుంబ సభ్యులతో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటే రానా తన శరీరాన్ని మరింత పెంచుకోవడానికి జిమ్ముల చుట్టూ తిరుగు తున్నాడు. అనుకున్న విధంగా ఈసినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలు పెట్టి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా అక్టోబర్ కు ఈసినిమాను పూర్తి చేస్తే కాని అనుకున్న విధంగా ‘బాహుబలి 2’ ను  2017 ఏప్రియల్ 14న విడుదల చేయడం కష్టం అనే భావనలో రాజమౌళి ఉన్నట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ఈసినిమా క్లైమాక్స్ కు రంగం సిద్ధం అవుతూ ఉండటంతో ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన సీక్రెట్స్ ను ఎట్టి పరిస్థుతుల లోను చాల రహస్యంగా ఉంచాలి అని ఈ సీక్రెట్స్ ను బయటకు లీక్ అయితే అది ‘బాహుబలి 2’ విజయజం పై తీవ్రభావాన్ని చూపెట్టడమే కాకుండా ఈసినిమాను అత్యంత భారీ మొత్తాలకు కొనడానికి ముందుకు వస్తున్న బయ్యర్ల ఆ శక్తి పై కూడా ఈ లీక్స్ ప్రభావాన్ని చూపెడతాయి కాబట్టి క్లైమాక్స్ కు సంబంధించి ఒక్క విషయం లీకైనా తాను సహించను అంటూ రాజమౌళి చాల గట్టి వార్నింగ్  ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన తారగణానికి సాంకేతిక నిపుణులకు అనేక మందికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: