నాచురల్ స్టార్ నాని ఫామ్ను చూస్తే స్టార్ హీరోలు కూడా షేక్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. హ్యాట్రిక్ హిట్ జోష్ మీదున్న ఈ హీరో ప్రస్తుతం తనకు మొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ జెంటిల్ మన్ సినిమా చేస్తున్నాడు. జూన్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 


అయితే నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీనే.. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే నానితో సినిమా చేయాలని దర్శక నిర్మాతలు తెగ ఆరాటపడతారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు నటుడిగా గుర్తింపు తెచ్చుకుని దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ చేరాడు. అష్టా చెమ్మా సినిమాతో ఇద్దరు ఒకేసారి కెరియర్ ఆరంభించారు నాని, అవసరాల శ్రీనివాస్.


ఇక పిల్ల జమిందార్ సినిమాలో కూడా వీరిద్దరి కాంబో సూపర్ హిట్ స్క్రీన్ మీద అలరించిన వీరిద్దరు ఇప్పుడు తెర వెనుక కలిసి పనిచేయాలని చూస్తున్నారు. తన సినిమాలను డైరెక్ట్ చేస్తూనే నటిస్తున్న అవసరాల శ్రీనివాస్ తనకు ఎంతో సన్నిహితంగా ఉండే నానితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. నాని కూడా అవసరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.


ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నాని తన హిట్ జోష్ లో తన స్నేహితులను కూడా భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇంద్రగంటికి జెంటిల్ మన్ తో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అయిన నాని.. అవసరాలకు కూడా మాంచి సూపర్ హిట్ ఇస్తాడనే అనుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: