మెగాఫ్యామిలీలో వాయిస్ పర్సన్స్ ఎవరు అని చూసుకుంటే మొదటగా చిరంజీవి, తరువాత పవన్ కళ్యాణ్, నాగాబాబు…ఇప్పుడు అల్లుఅర్జున్. అల్లుఅర్జున్ తరువాతనే రామ్ చరణ్, సాయిధరమ్, వరుణ్ తేజ్. అయితే ఇక్కడే కొంత తేడ అనిపిస్తుంది. చిరంజీవి నట వారసుడిగా వచ్చిన రామ్ చరణ్…అల్లుఅర్జున్ కంటే ముందుంటాడా? వెనకుంటాడా? అనే సందేహం అందరిలోనూ వస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఒకమనసు ఆడియో ఫంక్షణ్ లో అల్లుఅర్జున్ చేసిన స్పీచ్ ని చూస్తుంటే తన తరువాతే రామ్ చరణ్ అనే సందేహం ప్రేక్షకుల్లోని వెళ్ళింది.

వాళ్ళందరి తరుపున నేను మాట్లాడుతున్నా….నాలాగా వారు ఇబ్బంది ఇబ్బంది ఫేస్ చేయకూడదు…అంటూ చేసిన కామెంట్స్ తరువాతి తరంలో తనదే వాయిస్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అయితే అల్లుఅర్జున్ ఇప్పటి వరకూ స్టైలిష్ చిత్రాలను మాత్రమే చేయటంతో తను ఇంకా యంగ్ స్టర్ గానే మిగిలిపోయాడు. స్టార్ డం వచ్చినప్పటికీ…యూత్ ఐకాన్ గానే ఉన్నాడు కానీ…తను ఉపదేశాలు ఇచ్చే స్టేజ్ కి ఇంకా రాలేదేని ప్రముఖ ఛానల్ లో కథనం టెలికాస్ట్ అయింది.

అల్లుఅర్జున్ పెద్ద తరహాలో స్పీచ్ లు ఇవ్వాలనుకుంటే మాత్రం అందుకు ఇది తగిన సమయం కాదని అంటున్నారు. ప్రస్తుతం తనకు వచ్చిన బ్లాక్ బస్టర్స్  కంటే ఇంకా మరిన్ని బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో చేర్చుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఇంకా పెద్ద తరహా పాత్రలు ఉన్న సినిమాలు చేయాలని అంటున్నారు.

ప్రస్తుతం తను ఎటువంటి స్పీచ్ ఇచ్చినా…అది తన ఇమేజ్ ని మించి ఉందని…ఇటువంటి సమయంలో ఆ స్పీచ్ వాయిస్ ప్రేక్షకుల్లోకి సరిగావెళ్ళదని అంటున్నారు.మొత్తంగా అల్లుఅర్జన్ కి ఇంకా ఉపదేశాలు ఇచ్చే అనుభవం కావాలంటే ఇంకా అందుకు చాలానే సమయం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: