‘’బ్రహ్మోత్సవం’ సూపర్ ఫెయిల్యూర్ ఒక యంగ్ హీరోకు అదృష్టంగా మారింది. ఇప్పటికే వరస విజయాలతో దూసుకు పోతున్న సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుప్రీమ్‌’ సినిమా రొటీన్ గా ఉంది అని కామెంట్స్ వచ్చినా ఆసినిమాలో ఉన్న కామెడీ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈసినిమా బిసి సెంటర్లలో ఇప్పటికీ మంచి కలక్షన్స్ తో రన్ అవుతోంది. 

ఈసినిమా విడుదలైన దగ్గర నుంచి ఈసినిమ పై ఎటువంటి నెగిటివ్ టాక్ లేకపోఅవడంతో  మొదట్నుంచీ ఈసినిమాకు డీసెంట్‌ కలెక్షన్లు వస్తూనే వున్నాయి. ‘సరైలోడు’ సినిమా తరువాత నిజనైన సక్సస్ ను సాధించిన సినిమాగా ఈసినిమా మంచి కలక్షన్స్ ను తెచ్చుకుంది. దీనితో ఈ సినిమాకు రెండు వారాల స్టడీ రన్‌ దక్కింది. 

ఆ తరువాత ‘బ్రహ్మోత్సవం’ హవా మొదలు కావడంతో ఈ సినిమా పనిఅయిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే ఊహించని విధంగా ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫెయిల్యూర్ కావడం ‘సుప్రీమ్’ కు ఊహించని అదృష్టంగా మారింది. దీనితో ఈ సినిమాకు   మూడో వారంలో కూడా డీసెంట్‌ కలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఊహించని ట్విస్ట్ తో దిల్ రాజ్ మంచి జోష్ లో ఉండటమే కాకుండా ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఒక పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా సాయి ధరమ్ తేజ్ తాను నటించే సినిమాల స్పీడ్ ను పెంచే ఆలోచన చేస్తున్నట్లు టాక్. అయితే తన రానున్న సినిమాలలో చిరంజీవి రీమిక్స్‌ సాంగులు, ఫ్యామిలీ రిఫరెన్సులు లేకుండా సొంత ఐడెంటిటీ తెచ్చుకునే విధంగా తనకు ఇమేజ్ క్రియేట్ చేసే కథల కోసం ఈ మెగా యంగ్ హీరో అన్వేషణలో ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: