సూపర్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న మహేష్ కెరియర్ లో చేసినవి 22 సినిమాలు.. అయితే అందులో 11 సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా సరే టాలీవుడ్ స్టార్ హీరోగా మహేష్ రేసులో ముందంజలో ఉంటాడు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంటర్ అయిన మహేష్ ఆ సినిమా నుండి బ్రహ్మోత్సవం వరకు మొత్తం 22 సినిమాల్లో నటించడం జరిగింది.


మహేష్ సినిమాల్లో డిజాస్టర్ సినిమాల లిస్ట్ :


  1. వంశీ : బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మహేష్ బాబాయ్ జి.ఆద్శేషగిర్ రావు నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నమ్రతను ప్రేమించి పెళ్లాడాడు మహేష్. 


2. టక్కరి దొంగ : జయంత్ సి.పరాంజి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మహేష్ తొలిసారి కౌబాయ్ గెటప్లో కనబడ్డాడు. కాని బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.


3. బాబి : శోభన్ దర్శకత్వంలో వచ్చిన బాబి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కృష్ణ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు.   


4. నిజం : తేజ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మహేష్ నటనకు గాను ఎన్నో అవార్డులు వచ్చాయి.


5. నాని : ఎస్.జె సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని సినిమాను మంజుల నిర్మించారు. 


6. సైనికుడు : ఒక్కడు తర్వాత మహేష్ గుణశేఖర్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను అశ్వని దత్ నిర్మించారు. 


7. అతిథి : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమా యుటివి మోషన్ పిక్చర్స్ వారు నిర్మించారు.


8. ఖలేజా : అతడు తర్వాత మహేష్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో బోల్తా పడ్డది. కాని బుల్లితెర మీద ఖలేజా సినిమా ఓ సెన్షేషన్ అని చెప్పాలి.


9. 1 నేనొక్కడినే : సుకుమార్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మహేష్ కు భారీ షాక్ ఇచ్చింది. తానెంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా ఆడియెన్స్ ను కన్ ఫ్యూజ్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా ముద్రపడింది. 14 రీల్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.


10. ఆగడు : 1 ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల మీద ఉన్న నమ్మకంతో ఆగడు సినిమా చేశాడు మహేష్. కాని అది కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


11. బ్రహ్మోత్సవం : శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పివిపి బ్యానర్లో వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా వారికి కనెక్ట్ అవ్వడంలో విఫలమయ్యింది. 


అయితే కెరియర్ లో చేసిఒన 22 సినిమాల్లో 11 ఫ్లాపులు ఉన్నా సరే మహేష్ స్టామినా అంటే అదో కిక్ అన్నమాటే. మిగతా వారు కెరియర్ లో కేవలం 30 పర్సెంట్ ఫ్లాప్స్ ఉన్నా సరే మహేష్ ఇమేజ్ కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం లేదు అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: