నందమూరి తారకరామారావు పేరునే కాదు ఆయన రూపాన్ని కూడ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ గా అతడి అభిమానులు పిలుస్తూ ఉంటారు. నేటితో జూనియర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తి అయ్యాయి. పదిహేనేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన కెరీర్‌లో ఇటీవలే 25 చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్‌’ తో బిజీగాఉన్న జూనియర్ ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పదిహేను ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు.  

కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ కి ఎన్టీఆర్‌ అందుకొన్న పారితోషికం అక్షరాలా మూడున్నర లక్షలు. ఆ అమౌంట్ ను తన తల్లి శాలిని చేతుల్లోపెట్టాడట. జూనియర్ కు పుస్తకాలు చదవడం అంటే అస్సలు ఇష్టం లేదట. కాని ఏదైనా విషయం వినడం పై ఆసక్తి ఎక్కువ అని అంటున్నాడు. తారక్‌ లక్కీనెం.9.కావడంతో అతడి కారు నెంబర్లలలో అన్నీ తొమ్మిదిలే కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి క్రిక్కెట్‌  అంటే విపరీతమైన ఇష్టం ఉండటం తి చిన్న రూము దొరికితే చాలు  అందులేనే క్రికెట్‌ ఆడేసేవాడట. 

వంట చేయడం బగ్గా ఇష్ట మైన జూనియర్ బిరియానీలు వండి వార్చడంలో దిట్ట అని అంటున్నాడు. అయితే తన తల్లి వండిపెట్టే రొయ్యల బిరియానీ తన ఫేవరెట్‌ డిష్‌ అంటూ షాపింగు అంటే ఇష్టం ఉండదుగానీ వెరైటీ వాచీలను సేకరించడం తన హాబీ అని అంటున్నాడు. ఇక  ఫేవరెట్‌ సినిమా ‘దాన వీర శూర కర్ణ’ అని చెపుతూ తానూ ఎక్కువ సార్లు చూసిన హాలీవుడ్‌ చిత్రం ‘చార్లెస్‌ ఏంజిల్స్‌’. అన్న విషయాన్ని బయట పెట్టాడు.

తన పాతిక చిత్రాల్లో ‘నాన్నకు ప్రేమతో’ మనసుకు దగ్గరైన సినిమా అని అంటూ  తన  అభిమాన కథానాయకుడు తాతయ్య ఎన్టీఆర్‌. కథానాయిక అయితే శ్రీదేవి అన్న విషయాలను బయట పెట్టాడు. ‘మాతృదేవోభవ’ సినిమాలోని  ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటంటే తనకు చాలా ఇష్టంఅని చెపుతూ ఇప్పటికే ఆ పాటను కొన్ని వందల సార్లు విన్న సంగతిని బయటపెట్టాడు . ఇదే సందర్భం లో తన గురువు పేరు జగ్గివాసుదేవ్‌ అని చెపుతూ ఆయన్ని సద్గురు అని పిలుస్తూ ఉంటాను అన్న విషయం లీక్ చేసాడు. 

తనతో పనిచేసిన దర్శకులకు చిరు కానుకలు అందించడం తన అలవాటు అని అంటూ  తాను మర్చిపోలేని రోజు మార్చి26-- 2009 అని అంటున్నాడు మార్చి 26న ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురి అయితే అదే రోజు తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడాకావడం యాదృచ్చికం అని అంటున్నాడు. 15 సంవత్సరాలు నటనా జీవితాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ ఎప్పటికైనా తన తాత ‘దాన వీర శూరకర్ణ’ సినిమాను రీమేక్ చేస్తే చూడాలని ఎందరో జూనియర్ అభిమానులు ఆశ పడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: