టాలీవుడ్ లో కలెక్షన్ సునామీ సృష్టించి ఇండియన్ సినిమా రంగంలో టాప్ 10 లో స్థానం సంపాందించు కున్న ‘బాహుబలి’ సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎదురు అవుతున్న వరస పరాజయాలు రాజమౌళికి తీవ్ర కలవర పరుస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి ‘బాహుబలి’ ని ఎంత ప్రమోట్ చేసినా విదేశీ డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీ పై పెద్ద ఇంట్రెస్ట్ చూపటం లేదని టాక్. 

దీనికితోడు ఇటీవల జరిగిన కేన్స్ చలన చిత్రోత్సవాల్లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త వర్చ్యువల్ టెక్నాలజీ గురించి చెప్పి దాన్ని  ఆవిష్కరించినప్పటికీ రాజమౌళి మాటలకు అంతర్జాతీయ మీడియా అంత ఆసక్తిని ప్రదర్శించ లేదనే వార్తలు వస్తున్నాయి. ఈసినిమా రాజమౌళి అంచనాలకు అనుగుణంగా నార్త్ అమెరికాలో దుమ్ము రేపినా ఇటీవల జర్మనీలో రిలీజై అక్కడ ఘోర పరాజయం చెందింది. 

దీనికితోడు  గతవారం చైనాకు చెందిన ఎస్తార్ అనే పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ మూవీని తైవాన్ లో విడుదల చేసినా అక్కడ కూడ ఈసినిమా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమాకు చైనాలో కూడ ఇటువంటి పరాభవమే వస్తుందా అని ఈసినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎస్తార్ కంపెనీ తమ అనుమానాలను రాజమౌళి వద్ద వ్యక్త పరిచినట్లు టాక్.  

రాజమౌళి ‘బాహుబలి’ ని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తాలకు అమ్మినా ఆ దేశాలలోని మీడియా ‘బాహుబలి’ గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఈ సినిమాకు సరైన రివ్యూలు వ్రాయడం లేదు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. దీనితో త్వరలో లేటిన్ అమెరికా దేశాలలో త్వరలో విడుదల కాబోతున్న ‘బాహుబలి’ కి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అన్న టెన్షన్ రాజమౌళికి బాగా ఏర్పడినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: